సాక్షి, హైదరాబాద్: సినీఫక్కీలో మాదక ద్రవ్యాలు తరలిస్తూ పట్టుబడిన దక్షిణాఫ్రికాకు చెందిన మూసియా మూసా(32)ను ఉస్మానియా వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు బుధవారం ఆమెను ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
అక్రమంగా పొత్తికడుపులో రూ. 50 లక్షల విలువైన డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తరలిస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో మూసా పట్టుబడిన విషయం తెలిసిందే. నార్కోటిక్ అధికారులు ఆమెను ఆదివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ఆమె పొత్తి కడుపు నుంచి మొత్తం 51 డ్రగ్ ప్యాకెట్లను వెలికి తీశారు.