moosa
-
28 ఏళ్లకే కొడుకును విగ్రహంగా చూసి తండ్రి కన్నీటి పర్యంతం
చండీగఢ్: సిద్ధూ మూసేవాలా తండ్రి కొడుకును తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మే 29న దారుణ సిద్ధూ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ తండ్రి బాల్కౌర్ సింగ్ ఆవిష్కరించి వెక్కి వెక్కి ఏడ్చారు. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. 28 ఏళ్లకే కొడుకును విగ్రహం రూపంలో చూడాల్సి వస్తుందని అనుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రముఖ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలాకు గుర్తుగా ఆయన అభిమానులు 6.5 అడుగుల విగ్రహాన్ని తయారు చేయించారు. సిద్ధూ అంత్యక్రియలు జరిగిన మాన్సా జిల్లాలోని మూసా గ్రామంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి సిద్ధూ తల్లిదండ్రులు బాల్కౌర్ సింగ్, చరణ్ కౌర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కుమారుడ్ని విగ్రహం రూపంలో చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమానికి సిద్ధూ అభిమానులు భారీగా తరలివచ్చారు. Sidhu Moosewala’s parents got emotional while they were installing statue of their son where he got cremated #SidhuMooseWala pic.twitter.com/4qdlmXGWKn — Gagandeep Singh (@Gagan4344) July 17, 2022 విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం బాల్కౌర్ సింగ్ మాట్లాడారు. తన కుమారుడ్ని హత్య చేసిన వారు దేశ, విదేశాల్లో ఎక్కడ తలదాచుకున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సిద్ధూను చంపామని బహిరంగంగా ప్రకటించిన వ్యక్తికి ప్రభుత్వం భద్రత కల్పించడమేంటని మండిపడ్డారు. మే 29న సిద్ధూను ఓ వాహనంలో వెంబడించిన దుండగులు అతనిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశారు. ఘటన జరిగి సరిగ్గా 50 రోజులవుతున్న సమయంలోనే అభిమానులు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం గమనార్హం. చదవండి: ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా.. రిజర్వాయర్ ఎత్తైన అంచుకు వెళ్లి ఫొటో దిగుతూ.. -
ఉస్మానియా నుంచి మూసా డిశ్చార్జ్
సాక్షి, హైదరాబాద్: సినీఫక్కీలో మాదక ద్రవ్యాలు తరలిస్తూ పట్టుబడిన దక్షిణాఫ్రికాకు చెందిన మూసియా మూసా(32)ను ఉస్మానియా వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు బుధవారం ఆమెను ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అక్రమంగా పొత్తికడుపులో రూ. 50 లక్షల విలువైన డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తరలిస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో మూసా పట్టుబడిన విషయం తెలిసిందే. నార్కోటిక్ అధికారులు ఆమెను ఆదివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ఆమె పొత్తి కడుపు నుంచి మొత్తం 51 డ్రగ్ ప్యాకెట్లను వెలికి తీశారు. -
మూసాకు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్: డ్రగ్స్ తో పట్టుబడ్డ దక్షిణాఫ్రికా మహిళ మూసాకు 8 వ మెట్రో పాలిటన్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మూసాను విచారించేందుకు నార్కోటిక్ అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపధ్యంలో మూసాకు 14 రోజుల రిమాండ్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా మూసా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక అధికారులు ఈ రోజు ఉదయం కోర్టులో హాజరుపరిచారు. ఆమె నుంచి 45 కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.50 లక్షలు ఉంటుందని నార్కోటిక్ సూపరింటెండెంట్ దినేష్ చౌహాన్ తెలిపారు. మూసా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన తెలిపారు. -
మూసాకు డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాతో సంబంధాలు !
హైదరాబాద్ : మూసియా మూసా నుంచి ఇప్పటి వరకు 45 కొకైన్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని నార్కోటిక్ సూపరింటెండెంట్ దినేష్ చౌహాన్ మంగళవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. మూసాకు డ్రగ్స్ స్మగ్లింగ్‌తో సంబంధమున్నట్లు సమాచారం ఉందన్నారు. కడుపులో డ్రగ్స్‌తో స్మగ్లింగ్ చేయడం ద్వారా హైదరాబాద్‌లో పట్టుబడ్డటం ఇదే తొలసారి అన్ని ఆయన స్పష్టం చేశారు. ముంబైలో ఇదే తరహాలో గతంలో ఓ కేసు నమోదు చేసుకుందని దినేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి విచారిస్తామన్నారు. ఒక్కొక్క ప్యాకెట్ 13.5 గ్రాముల బరువు ఉందని చెప్పారు. వీటి విలువ రూ. 50 లక్షలపైగా ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. మూసా ఆర్యోగం నిలకడగానే ఉందన్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే మూసాను విచారిస్తామని దినేష్ చౌమాన్ వెల్లడించారు.