హైదరాబాద్ : మూసియా మూసా నుంచి ఇప్పటి వరకు 45 కొకైన్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని నార్కోటిక్ సూపరింటెండెంట్ దినేష్ చౌహాన్ మంగళవారం హైదరాబాద్లో వెల్లడించారు. మూసాకు డ్రగ్స్ స్మగ్లింగ్తో సంబంధమున్నట్లు సమాచారం ఉందన్నారు. కడుపులో డ్రగ్స్తో స్మగ్లింగ్ చేయడం ద్వారా హైదరాబాద్లో పట్టుబడ్డటం ఇదే తొలసారి అన్ని ఆయన స్పష్టం చేశారు.
ముంబైలో ఇదే తరహాలో గతంలో ఓ కేసు నమోదు చేసుకుందని దినేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి విచారిస్తామన్నారు. ఒక్కొక్క ప్యాకెట్ 13.5 గ్రాముల బరువు ఉందని చెప్పారు.
వీటి విలువ రూ. 50 లక్షలపైగా ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. మూసా ఆర్యోగం నిలకడగానే ఉందన్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే మూసాను విచారిస్తామని దినేష్ చౌమాన్ వెల్లడించారు.