కడుపులో కత్తెర మరచిపోయి కుట్టేశారు | scissors in stomach | Sakshi

కడుపులో కత్తెర మరచిపోయి కుట్టేశారు

May 28 2014 8:23 PM | Updated on Sep 2 2017 7:59 AM

కడుపులో కత్తెర మరచిపోయి కుట్టేశారు

కడుపులో కత్తెర మరచిపోయి కుట్టేశారు

ఓ రోగికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఆమె కడుపులో కత్తెర మరిచిపోయి కుట్టేశారు.

 రాయబరేలి: ఓ రోగికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఆమె కడుపులో కత్తెర మరిచిపోయి కుట్టేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.  మహరాజ్‌గంజ్ తహసిల్‌లోని రాజాకపూర్ గ్రామానికి చెందిన శివకాళి అనే మహిళకు ఓ నర్సింగ్ హోం వైద్యుడు రాకేశ్ రాజ్‌పుత్ కొన్ని నెలల క్రితం శ స్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచి ఆమె తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది.

కడుపు నొప్పి తట్టుకోలేక  ఇటీవల ఆమె చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏకే సింగ్‌ను కలిసి విషయం తెలియజేసింది. ఏకే సింగ్  వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమె కడుపులో కత్తెర ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement