
కొవ్వు అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి చేటు. ఈ విషయం మనకు తెలు సుగానీ.. ఎప్పుడో 5300 ఏళ్లక్రితం బతికున్న మనిషికి తెలియదు. అందుకేనేమో.. ఆ మనిషి ఎంచక్కా కొవ్వులున్న ఆహారాన్ని సుష్టుగా లాగించేశాడు. విషయం ఏమింటే.. ఫొటోలో కనిపిస్తోందే.. అది ఐదువేల ఏళ్ల క్రితం నాటి ఓ మనిషి అవశేషం. ఆల్ప్స్ పర్వతప్రాంతాల్లో మంచులో గడ్డకట్టుకుపోయి ఉండగా 1991లో బయటపడింది. శాస్త్రవేత్తలు ఐస్‌మ్యాన్ అని పేరు పెట్టారు. మంచులో ఉండిపోవడం వల్ల శరీరం పెద్దగా నాశనం కాలేదు. దీంతో శాస్త్రవేత్తలు ఐస్‌మ్యాన్ ఆ కాలంలో ఏం తిని ఉంటాడో తెలుసుకోవాలని అనుకున్నారు. పొట్టలో మిగిలి ఉన్న పదార్థాలను విశ్లేషించడం ద్వారా ఐస్‌మ్యాన్ చివరగా తీసుకున్న ఆహారంలో కొవ్వులు బాగా ఉన్నట్లు గుర్తించారు.
ఈ పరిశోధన ఆ కాలపు ప్రజల ఆహారపు అలవాట్లను తెలుసుకునేందుకు మాత్రమే కాకుండా... వంటలు ఎలా వండేవారో అర్థం చేసుకునేందుకు పనికొస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎప్పుడో 1991 ప్రాంతంలో బయటపడ్డ ఐస్‌మ్యాన్ కడుపు లో ఏముందో తెలుసుకునేందుకు ఇంత సమయం ఎందుకు పట్టిందన్న అనుమానానికి ఈపరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మాక్సినర్ సమాధానమిస్తూ.. ఐస్‌మ్యాన్ కడుపు ఎక్కడుందో తెలుసుకోవడం మొదట్లో కష్టమైందని చెప్పారు. శరీరం మమ్మీలా మారిపోయే క్రమంలో కడుపు కాస్తా పైకి చేరిపోయిందని 2009లో సీటీస్కాన్ సాయంతో దీన్ని గుర్తించి ఆ తరువాత పరిశోధనలు చేపట్టామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment