![Doctors Remove Coins From Old Man Stomach In Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/28/Doctors-Remove-Coins-From-O.jpg.webp?itok=qncp0UNW)
యశవంతపుర(కర్ణాటక): మానసిక రోగి ఆయిన ఓ వృద్ధుడు తన చేతికి ఇచ్చే నాణేలను నిత్యం మింగేసేవాడు. రాయచూరు జిల్లా లింగసుగూరు తాలూకాకు చెందిన ద్యావప్ప (58) ఇలా 187 నాణేలను మింగాడు. అనారోగ్యానికి గురి కావటంతో కుటుంబ సభ్యులు బాగలకోట బసవేశ్వర సంఘం కుమారేశ్వర ఆస్పత్రికి తరలించారు.
అక్కడి వైద్యులు ఎక్స్‌రే తీసి ఇక ఆలస్యం చేస్తే ప్రాణానికి పెను ప్రమాదమని వెంటనే శస్త్ర చికిత్స చేసి నాణేలను బయటకు తీశారు. ఐదు, రెండు రూపాయలు కాయిన్లు చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. డాక్టర్ ఈశ్వర కలబురిగి, ప్రకాశ కట్టిమని, అర్చన, రూపలు శస్త్ర చికిత్స చేశారు. శస్త్ర చికిత్స తరువాత ద్యావప్ప ఆరోగ్యం కుదుటపడింది.
చదవండి: పెళ్లి పీటలెక్కనున్న నటి.. కాబోయే భర్త ఎవరంటే?
Comments
Please login to add a commentAdd a comment