సాక్షి, హైదరాబాద్: సినీఫక్కీలో మాదకద్రవ్యాలు తరలిస్తూ పట్టుబడిన దక్షిణాఫ్రికా మహిళ మూసా కడుపు నుంచి మొత్తం 40 డ్రగ్స్ ప్యాకెట్లను బయటికి తీశారు. ఎనిమా ఇచ్చి ఇప్పటికే 18 ప్యాకెట్లు వెలికితీసిన వైద్యులు సోమవారం మరో 22 ప్యాకెట్లను తీశారు. రూ.50 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను పొత్తికడుపులోకి చొప్పించుకొని వస్తున్న మూసా(32).. ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ అధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే. అధికారులు ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకురాగా ఆదివారం రాత్రి 18 డ్రగ్ ప్యాకెట్లను తీశారు.
సోమవారం ఆమెకు మళ్లీ అల్ట్రాసౌండ్, సిటిస్కాన్ చేశారు. మరికొన్ని ప్యాకెట్లు లోపలే ఉన్నట్లు నిర్ధారించి, మరోసారి ఎనిమా ఇచ్చారు. దీంతో 22 ప్యాకెట్లు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరోసారి స్కాన్ చేస్తామని, కడుపులో ప్యాకెట్లు లేకపోతే డిశ్చార్జి చేస్తామని వెల్లడించాయి.
పరీక్షల కోసం ల్యాబ్‌కు..
మూసా కడుపు నుంచి బయటికి తీసిన డ్రగ్స్ ప్యా కెట్లను నార్కొటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు. చిన్న పరిమాణంలో ప్యాకెట్లు చేయడంతో అది కొకైన్ అయి ఉంటుం దని అనుమానిస్తున్నారు. ఈ డ్రగ్స్‌ను మహిళ ఎక్కడికి తరలిస్తోందన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
కడుపు నిండా డ్రగ్స్ ప్యాకెట్లే!
Published Tue, Sep 1 2015 2:21 AM | Last Updated on Fri, May 25 2018 2:29 PM
Advertisement
Advertisement