Lithuania
-
Ukraine-Russia war: నాటో నాటో.. ఎప్పుడో ఎప్పుడో!
ఎస్.రాజమహేంద్రారెడ్డి: నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సభ్య దేశాల సమావేశం ఉక్రెయిన్ ఆశలపై నీళ్లు చల్లింది. నాటో.. నాటో అంటూ కలవరించిన ఉక్రెయిన్ ఇప్పుడు నాటు.. నాటు అనక తప్పడం లేదు. గతేడాది మాడ్రిడ్‌లో జరిగిన సమావేశం అనంతరం స్వీడన్, ఫిన్లండ్లను కూటమిలో చేర్చుకుంటున్నట్టు నాటో ప్రకటించింది. ఆ రెండు దేశాలు జూలై 11, 12 తేదీల్లో లిథువేనియాలో జరిగిన సమావేశాలకు కూడా హాజరయ్యాయి. ఇదే బాటలో నాటో కూటమి తమను కూడా అక్కున చేర్చుకుంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆశించారు. కానీ ఆయన అనుకున్నదొకటైతే జరిగింది మరొకటి! ఉక్రెయిన్ భవిష్యత్తు తమతోనే ముడిపడి ఉంటుందని సమావేశం చివరి రోజు నాటో పేరుకు ఒక ప్రకటన చేసినా, ఆ భవిష్యత్తు ఎప్పుడు ఆరంభమవుతుందో మాత్రం స్పష్టం చేయలేదు. దాదాపు 500 రోజులకు పైగా రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు పశి్చమ దేశాలు ఆయుధ సామగ్రితో పాటు యుద్ధ ట్యాంకులు, ఫైటర్ జెట్లను సమకూరుస్తూ అండగా ఉన్నప్పటికీ, ఆ సాయం వెనక ఆయా దేశాల ఊగిసలాట ధోరణి జెలెన్స్కీని కలవరపరుస్తూనే వస్తోంది. ప్రతిదానికీ చేతులు జోడించి ఎదురు చూడాల్సి రావడం ఆయనకు మింగుడు పడటం లేదు. నాటో కూటమిలోకి ప్రవేశం దక్కితే ఈ అవస్థ ఉండదన్నది జెలెన్స్కీ ఆలోచన. నిజానికి నాటోలో చేరితే ఉక్రెయిన్ రక్షణ బాధ్యతను కూటమి దేశాలన్నీ సంయుక్తంగా మోయాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ భవితవ్యాన్ని, రష్యాతో జరుగుతున్న యుద్ధ గమనాన్ని శాసించే నాటో సభ్యత్వ వ్యవహారంలో నిజానికి ఏం జరిగింది? ఉక్రెయిన్‌కు సభ్యత్వమిచ్చేందుకు ఎందుకు నాటో పచ్చజెండా ఊపలేదు? అసలు జెలెన్స్కీ ఆశించిందేమిటి? వివరాల్లోకి వెళ్దాం... అనుకున్నదొక్కటి... జెలెన్స్కీ ఏం ఆశిస్తున్నదీ సుస్పష్టం. గత సెపె్టంబరుకు ముందు ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం కావాలన్న తన అభ్యర్థనను 2023 జూలైలో లిథువేనియాలో జరిగే కూటమి సమావేశంలో వ్యక్తం చేస్తానని అన్నారు. కానీ ఈ వ్యాఖ్యల్లో మొక్కుబడితనమే తప్ప గాఢమైన కోరికేమీ ధ్వనించలేదు. ఉక్రెయిన్ ప్రాంతాలైన లుహాన్స్్క, డొనెట్స్్క, ఖెర్సన్, జపోరిజియాలను తమ భూభాగాలుగా గుర్తిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ గత సెపె్టంబరులో ప్రకటించగానే జెలెన్స్కీ స్వరం మారిపోయింది. నాటోలో తమకు పూర్తి సభ్యత్వమిచ్చే అంశాన్ని ఆగమేఘాల మీద పరిశీలించాల్సిందిగా జెలెన్స్కీ అభ్యరి్థంచడం మొదలెట్టారు. అంటే నాటో సభ్యత్వాన్ని ఉక్రెయిన్ సీరియస్‌గా ఆశిస్తున్నది కేవలం ఏడాది క్రితం నుంచేనని సుస్పష్టం. నాటో మార్గదర్శకాల ప్రకారం యూరప్‌లోని ఏ దేశమైనా సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పన్నెండు దేశాల కూటమిగా మొదలైన నాటో సభ్య దేశాల సంఖ్య ఇప్పుడు 32కు పెరిగింది. లిథువేనియాలోని విలి్నయస్లో జరిగిన నాటో భేటీకి హాజరైన జెలెన్స్కీ పనిలో పనిగా లుకిస్కస్ స్క్వేర్‌లో జరిగిన ఓ సభలో తమ అభీష్టాన్ని అక్కడి జనాలతో పంచుకున్నారు. సభా వేదికపై ‘ఉక్రెయిన్–నాటో 33’ నినాదాన్ని కూడా ప్రదర్శించడం విశేషం. నాటో నేతలకే ఇష్టం లేదు...! లుకిస్కస్ స్క్వేర్ సభా వేదికపై ప్రదర్శితమైన ‘ఉక్రెయిన్–నాటో 33’ బ్యానర్ అక్కడివారి మది దోచినా, ఉక్రెయిన్ మెడలో ఇప్పటికిప్పుడే ‘నాటో–33’ గుర్తింపు కార్డు పడటం మాత్రం నాటో నేతల్లోనే చాలామందికి అసలు ఇష్టం లేదు. అందుకే ‘అప్పుడే కాదం’టూ ఉక్రెయిన్ అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. ఒకవైపు యుద్ధం కొనసాగుతుండగా మరోవైపు ఉక్రెయిన్‌కు సభ్యత్వాన్ని మంజూరు చేస్తే నాటో దేశాలన్నీ రష్యాపై ప్రత్యక్షంగా యుద్ధ బరిలోకి దిగాల్సి వస్తుంది. నాటో నిబంధనల ప్రకారం ఏ సభ్య దేశంపై దాడి జరిగినా కూటమిలోని దేశాలన్నీ సంయుక్తంగా ఎదురు దాడి చేయాల్సి ఉంటుంది. నాటో నిబంధనల్లోని ఆరి్టకల్–5 ఈ విషయాన్ని స్పష్టంగా నిర్దేశించింది. నాటో చరిత్రలో ఇప్పటిదాకా ఒకే ఒక్కసారి, అమెరికాపై 9/11 ఉగ్ర దాడులు జరిగినప్పుడు ఈ నిబంధన అమలైంది. ఒకవేళ ఇప్పుడు గనక ఉక్రెయిన్‌కు సభ్యత్వమిస్తే కూటమిలోని మిగతా 32 దేశాలూ రష్యాపై యుద్ధానికి దిగాల్సి వస్తుంది. ‘నాటో దేశాల భూభాగంలో ఒక్క అంగుళం కూడా వదులుకోవడానికి మేం సిద్ధంగా లేం. ఇప్పుడు యుద్ధం నడిమధ్యలో ఉంటే తలపడటానికి సిద్ధంగా ఉన్నాం. అసలు ఆ మాటకొస్తే ఇప్పుడు మేమంతా రష్యాతో యుద్ధం చేస్తున్నట్టే లెక్క’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించడం గమనార్హం. నాటో కూటమి తమ సభ్య దేశాల పట్ల ఎంతటి అంకితభావంతో ఉంటుందో బైడెన్ ఈ వ్యాఖ్యలతో ప్రపంచానికి చాటారు. అయితే బైడెన్ వ్యాఖ్య వెనక అసలు ఉద్దేశాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి జెన్ వాలెస్ కుండబద్దలు కొట్టారు. ‘ప్రస్తుతం యుద్ధం మధ్యలో ఉన్న దేశాన్ని ఇప్పటికిప్పుడు కూటమిలోకి ఆహా్వనించలేం. అలా చేయడం మొత్తం కూటమినీ యుద్ధభూమిలోకి లాగడమే అవుతుంది’’ అంటూ అసలు విషయం చెప్పకనే చెప్పారు. యుద్ధం ముగిశాక గెలుపోటములతో నిమిత్తం లేకుండా వీలైనంత త్వరగా ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సభ్యత్వానికి నాటో ఇలా సూత్రప్రాయంగా అంగీకరించినా అధికార ముద్ర ఎప్పుడు పడుతుందో చెప్పలేం. యుద్ధం ముగిసేదాకా ఉక్రెయిన్‌కు నాటో మోక్షం లేదని స్పష్టంగా తెలిసిపోతున్నా, యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనేది మాత్రం అస్పష్టం! జెలెన్స్కీకీ ముందే తెలుసు...! యుద్ధం జరుగుతుండగా నాటో సభ్యత్వం రావడం కల్లేనని జెలెన్స్కీకీ తెలుసు. అయితే రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఆయన పదేపదే నాటో సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘యుద్ధం జరుగుతుండగా నాటో సభ్యత్వం మాటే ఉండదు. మాకది ఇష్టం లేక కాదు, కానీ అసాధ్యం’ అని జెలెన్స్కీ ఐదారు నెలల క్రితం కీవ్‌లో తన మనసులో మాటను సుస్పష్టంగా చెప్పారు. అయితే యుద్ధం ముగిసిన వెంటనే నాటో సభ్యత్వం లభించేలా ఓ రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసుకోవడానికే పదేపదే ఇలా సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సభ్యత్వంపై ఎటూ తేల్చని నాటో కనీసం ఆ దిశగా ఎలాంటి కార్యాచరణనూ ప్రకటించకపోవడం ఉక్రెయిన్ అధ్యక్షుడిని నిరాశకు గురి చేసింది. ఇది ఒకరకంగా ఉక్రెయిన్ను ఆగమ్యగోచరమైన పరిస్థితిలోకి నెట్టిందనే భావించాలి. ఉక్రెయిన్ ఉక్రెయిన్‌గా నిలవాలంటే యుద్ధాన్ని గెలవాలి, లేదా రష్యాతో సంధి కుదుర్చుకోవాలి. ఈ రెండు పరిస్థితుల్లోనే ఉక్రెయిన్ నాటోలో చేరగలుగుతుంది. ఓడిపోతే ఉక్రెయిన్ రష్యాలో అంతర్భాగంగా మారిపోతుంది. అప్పుడిక దానికి నాటో ప్రస్తావన అవసరమే లేకుండా పోతుంది. గెలుపోటములను కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఇప్పటిదాకా ‘అయితే గియితే’లో ఉన్న నాటో సభ్యత్వ అంశం ‘ఆ సుదినం ఎప్పుడు’ అనేదాకా అయితే వచి్చంది. ప్రస్తుతానికి ఉక్రెయిన్‌కు ఊరటనిచ్చే విషయం ఇదొక్కటే. యుద్ధం త్వరలో ఓ కొలిక్కి వచ్చి ఉక్రెయిన్‌కు నాటో తలుపులు తెరుకోవాలని కోరుకుందాం! తెరుచుకుంటాయనే ఆశిద్దాం!! -
రికార్డు బ్రేక్ ‘వీలీ’ స్టంట్
రోడ్డుపై బైక్‌లతో కుర్రకారు చేసే విన్యాసాలను మనలో చాలా మంది చూసే ఉంటాం.. బండిని మెలికలు తిప్పుతూ పోనీయడం.. ముందు చక్రాన్ని పైకి లేపి యాక్సిలేటర్‌ను రెయిజ్ చూస్తూ దూసుకుపోవడం, అత్యంత వేగంగా బండిని నడుపుకుంటూ వచ్చి వెనుక చక్రం పైకి లేచేలా ఒక్కసారిగా బ్రేక్ వేయడం... బండిని ఉన్నచోటనే గుండ్రంగా తిప్పడం వంటి స్టంట్లను మీరు చూసే ఉంటారు. కానీ లిథువేనియాకు చెందిన అరునస్ గిబేజా అనే స్టంట్ రైడర్ వీటన్నింటికన్నా క్లిష్టమైన ఓ విన్యాసాన్ని చేసి చూపించి సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించాడు. ఇంతకీ అతను చేసిన స్టంట్ ఏమిటంటే... బండిని కేవలం వెనుక చక్రంపై నడపడమే (వీలీ) కాకుండా హ్యాండిల్‌ను వదిలేసి ఏకంగా అర కిలోమీటర్‌కుపైగా దూరం (580 మీటర్ల 81 సెంటీమీటర్లు) దూసుకెళ్లాడు. తద్వారా 2019లో భారత్‌కు చెందిన రోహితేశ్ ఉపాధ్యాయ్ అనే యువకుడు సుమారు 566 మీటర్ల దూరంపాటు ఇదే రకంగా బండి నడిపి నమోదు చేసిన గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టాడు. -
సరికొత్త ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 319 కిలో మీటర్లు
అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఇటలీలోని వెరోనాలో మంగళవారం జరిగిన యురోపియన్ ఛాంపియన్‌షిప్‌లో లిథువేనియాకు చెందిన 41 ఏళ్ల అలెగ్జాండర్ సోరోకిన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. 24 గంటల్లో సోరోకిన్ 319.614 కిలోమీటర్ల దూరం పరిగెత్తి ప్రపంచ రికార్డు లిఖించాడు. కాగా అలెగ్జాండర్ సగటున ఒక కిలోమీటర్ దూరాన్ని 4.30 నిమిషాల్లో దాటేశాడు.ఇంతకముందు అతని పేరిటే ఉన్న రికార్డుపే సోరోకిన్ బద్దలు కొట్టడం విశేషం. గతేడాది ఆగస్టులో 24 గంటల్లో అతను 303.506 కిలోమీటర్ల దూరాన్ని పరుగెత్తాడు. తాజా రికార్డుపై 40 ఏళ్ల సోరోకిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించాడు. ''చాలా అలిసిపోయా.. కానీ రికార్డుతో డబుల్ ఆనందంతో ఉన్నా. విషయమేంటనేది అర్థమయిందిగా.. ప్రపంచ రికార్డు కొట్టడం ఒక ఎత్తయితే.. నా రికార్డును నేనే బద్దలు కొట్టడం మరింత సంతోషాన్నిచ్చింది.'' అంటూ తెలిపాడు. ఇక పొలాండ్‌కు చెందిన అథ్లెట్ పియోట్రోస్కీ 24 గంటల్లో 301.858 కిలోమీటర్ల దూరం పరిగెత్తి రెండో స్థానంలో నిలవగా.. ఇటలీకి చెందిన మార్కో విసినిటీ 288 కిలోమీటర్ల దూరం పరిగెత్తి మూడో స్థానంలో నిలిచాడు. Ultrarunning legend Aleksandr Sorokin has just smashed his own record (192.252 miles) of distance covered in 24 hours of running 🔥🇱🇹 The Lithuanian has just covered 318.8km / 198.1 miles (unofficial) – 7:15/mile and 4:30/km pace...over a day 🤯 pic.twitter.com/35pWdAE3Ug — AW (@AthleticsWeekly) September 18, 2022 View this post on Instagram A post shared by Aleksandr Sorokin (@ultrarunner_aleksandr_sorokin) చదవండి: Karman Kaur: భారత నంబర్‌వన్‌గా కర్మన్ కౌర్ ICC New Rules: అక్టోబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్.. టి20 ప్రపంచకప్‌లో తొలిసారిగా -
Shocking: వ్యక్తి కడుపులో కేజీకీ పైగా నట్టులు, బోల్టులు
విల్నియస్: కొందరు వ్యక్తులు.. వెంట్రుకలను, బోల్ట్లను తినడం వంటి వార్తలను మనం అప్పుడప్పుడూ చదువుతూ ఉంటాం. గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి లిత్వేనియాలో జరిగింది. ఒక వ్యక్తి కడుపులో దాదాపు కిలోగ్రాము స్క్రూలు, నట్టులు, బోల్టులను వైద్యులు శస్త్రచికిత్స చేసి వెలికితీశారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. లిత్వేనియాకు చెందిన వ్యక్తి మొదట మద్యానికి బానిసయ్యాడు. ఆ తర్వాత దాన్ని మానుకునే క్రమంలో.. అనుకోకుండా నట్టులు, బోల్టులు, గోర్లు వంటివి తినడం అలవాటు అయింది. దీంతో కొన్ని రోజులుగా అతడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కడుపునొప్పి ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు.. అతడిని అంబులెన్స్‌లో బాల్టిక్ సముద్ర తీరంలో ఉన్న క్లైపెడా యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వ్యక్తికి డాక్టర్లు స్కానింగ్ చేశారు. అతని కడుపులో కొన్ని వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో శస్త్ర చికిత్స ప్రారంభించారు. దాదాపు మూడు గంటలపాటు శ్రమించిన సరునాస్ డైలీడేనాస్ వైద్యుల బృందం అతని కడుపులో నుంచి దాదాపు కిలోగ్రాము బరువున్న స్క్రూలు, నట్టులు, గోర్లను బయటకు తీశారు. ఆ తర్వాత వ్యక్తి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. చదవండి: వామ్మో.. 14 అడుగుల కొండ చిలువ, 6 అడుగుల మొసలి.. -
చైనా ఫోన్లు కనిపిస్తే విసిరి కొట్టండి, ఆదేశాలు జారీ చేసిన రక్షణ శాఖ
దేశంలో చైనా స్మార్ట్ ఫోన్ లు కనిపిస్తే చాలు విసిరికొట్టండి. వాటిని వినియోగించడానికి వీల్లేదంటూ ఓ దేశానికి చెందిన రక్షణ శాఖ ఆ దేశ ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. చైనా ఫోన్లతో పాటు షావోమీ, హువావే ఫోన్ల వినియోగం నిలిపివేయాలని స్పష్టం చేసింది. అందుకు కారణం ఏదైనా..ఆదేశ ప్రభుత్వ నిర్ణయం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలోని పలు దేశాలు చైనా చేస్తున్న కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ సైతం చైనా ప్రాడక్ట్‌లకు వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే చైనాకు చెందిన యాప్‌లపై కేంద్రం నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్‌తో పాటు యూరప్ దేశాలకు చెందిన లుథువేనియా సైతం చైనాపై ఎదురు దాడికి దిగుతున్నాయి. చైనా తయారు చేసిన స్మార్ట్ ఫోన్లలో సెన్సార్ షిప్ ఉందంటూ లుథువేనియా రక్షణశాఖ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ సెన్సార్ షిప్ వల్ల చైనా స్మార్ట్ ఫోన్లలో దేశానికి చెందిన 449 పదాలు అవుతున్నాయని ఆరోపించింది.ఫ్రీ టిబెట్, లాంగ్ లివ్ తైవాన్ ఇండిపెండెన్స్, డెమొక్రసీ మూవ్మెంట్ పదాల్ని బ్లాక్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా ఫోన్లతో పాటు షియోమీ ఫ్లాగ్షిప్ మోడల్ ఎంఐ 10టీ 5జీ ఫోన్లోనూ ఈ సెన్సార్షిప్ ఉందని ఆదేశ రక్షణశాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆ దేశాదినేతలు చైనాతో పాటు పలు స్మార్ట్ ఫోన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సెన్సార్ షిప్ ఉన్న స్మార్ట్ ఫోన్ లను విసిరి పడేయండి' అని లిథుయేనియా రక్షణ శాఖ సహాయ మంత్రి మార్గిరిస్ అబుకెవిసియస్ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే లిథుయేనియా ఆరోపణలపై షియోమీ సంస్థ ఖండించింది.తమ ఫోన్లలో అలాంటి సెన్సార్షిప్ లేదని స్పష్టం చేసింది. చదవండి: తస్మాత్ జాగ్రత్త..ఈ స్మార్ట్ ఫోన్లు వారిని కనిపెట్టేస్తాయ్ -
‘అవును.. తప్పు చేశా.. నేరం అంగీకరిస్తున్నా’
మింక్: ‘‘అవును.. నేను తప్పు చేశాను. నేరాన్ని అంగీకరిస్తున్న. ప్రస్తుతం నేను మింక్లోని నంబర్ 1 డిటెన్షన్ సెంటర్లో సురక్షితంగా ఉన్నాను. నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. గుండెతో పాటు ఇతర అవయవాలు కూడా బాగా పనిచేస్తున్నాయి’’... బెలారస్ జర్నలిస్టు రోమన్ ప్రొటాసెవిక్ నేరం అంగీకరిస్తున్నట్లుగా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. గ్రీస్ నుంచి లిథువేనియాకు విమానంలో వెళ్తున్న అతడిని బెలారస్ ప్రభుత్వం ఆదివారం అరెస్టు చేయించిన విషయం తెలిసిందే. రోమన్ ప్రయాణిస్తున్న రియాన్ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందన్న సందేశంతో, యుద్ధ విమానం ఎస్కార్టుగా రాగా, దానిని తమ రాజధాని మింక్లో అత్యవసరంగా ల్యాండ్ కాగా.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగానే నిరసనలకు కేంద్ర బిందువు అయ్యాడన్న ఆరోపణల నేపథ్యంలో.. రోమన్‌ను బంధించేందుకే సుమారుగా 170 మందితో ప్రయాణిస్తున్న విమానాన్ని ‘హైజాక్’ చేయించారంటూ అంతర్జాతీయ సమాజం నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో... పోలీసుల అదుపులో ఉన్న రోమన్ ఆరోగ్యం చెడిపోయిందనే వార్తలు మరోసారి ఆగ్రహ జ్వాలలకు కారణమయ్యాయి. ఈ విషయంపై స్పందించిన బెలారస్ హోం మంత్రి.. రోమన్ బాగానే ఉన్నాడని, ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా రోమన్‌తో స్వయంగా వీడియో విడుదల చేయించడం గమనార్హం. ఇందులో.. ‘‘నన్ను బాగా చూసుకుంటున్నారు. చట్టప్రకారం వాళ్లు చేస్తున్నది సరైనదే. విచారణాధికారులకు నేను పూర్తిగా సహకరిస్తాను. మింక్ సిటీలో మూకుమ్మడి నిరసన కార్యక్రమాలకు నేనే కారణం అన్న విషయాన్ని అంగీకరిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. అయితే, రోమన్ సహచర జర్నలిస్టు స్టెఫాన్ పుటిలో మాత్రం ఈ విషయాన్ని ఖండించారు. ‘‘తన చేత బలవంతంగా ఈ మాటలు చెప్పించారనడానికి, అతడి నుదురు మీద ఉన్న నల్లటి మచ్చలే ఉదాహరణ’’ అంటూ రోమన్ పట్ల అధికారుల వ్యవహారశైలిని విమర్శించారు. అతడిని కొట్టినట్లుగా ఆనవాలు కనబడుతుంటే, ఈ వీడియోను ఎలా నమ్మాలంటూ ప్రశ్నించారు. కాగా స్థానిక చట్టాల ప్రకారం.. బహిరంగ మూకుమ్మడి నిరసనకు కారణమైన వారికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఇక అధ్యక్ష ఎన్నికల సమయంలో రోమన్ చట్టవ్యతిరేకంగా వ్యవహరించాడని అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. ఇక గత రెండు దశాబ్దాలుగా బెలారస్‌ను పాలిస్తున్న అలెగ్జాండర్ లుకాషెంకో మరోసారి అధ్యక్ష పీఠం అధిరోహించిన నేపథ్యంలో.. ఉద్దేశపూర్వంగానే ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారంటూ ప్రతిపక్ష నాయకులు ఆయనను విమర్శిస్తున్నారు. చదవండి: Ryanair: ‘అతడి కళ్లల్లో భయం.. చావు తప్పదని చెప్పాడు’ "I confess and cooperate with the investigation" says Roman #Protasevich in a video released by the #Belarusian authorities. This obviously looks like a forced confession; + the marks on his forehead.. pic.twitter.com/a7L3gtQkP2 — inna shevchenko (@femeninna) May 24, 2021 -
Ryanair: ‘అతడి కళ్లల్లో భయం.. చావు తప్పదని చెప్పాడు’
‘‘అతడు భయంతో వణికిపోవడం నేను చూశాను. అతడి కళ్లు విషాదంతో నిండిపోవడం గమనించాను. ఇంతలో తను మా వైపు తిరిగి.. తాను మరణశిక్ష ఎదుర్కోబోతున్నట్లు చెప్పాడు’’ వెబ్‌డెస్క్: గ్రీస్ నుంచి లిథువేనియా వెళ్లాల్సిన రియాన్ఎయిర్ విమానం 4978 అది. దాదాపు పన్నెండు దేశాలకు చెందిన 170 మంది అందులో ప్రయాణిస్తున్నారు. అయితే, అకస్మాత్తుగా ఆ విమానం బెలారస్ వైపు మళ్లింది. యుద్ధ విమానం వెంబడి రాగా ఆ దేశ రాజధాని మింక్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. లోపల ఉన్న ప్రయాణికులకు అసలేమీ అర్థం కాలేదు. లిథువేనియా వెళ్లాల్సిన విమానం ఇలా మధ్యలో ఎందుకు ఆపేశారు.. ఇందుకు గల కారణాలేమీటో వారికి అంతుపట్టలేదు.. అయితే, ఓ వ్యక్తి మాత్రం వెంటనే జరిగే పరిణామాలను ఊహించి, లగేజ్‌బ్యాగ్ నుంచి వడివడిగా తన లాప్టాప్, మొబైల్ తీసుకుని పక్కనే ఉన్న అమ్మాయికి అందించాడు. అంతలోనే అక్కడికి చేరుకున్న బెలారస్ పోలీసులు 26 ఏళ్ల ఆయువకుడిని అరెస్టు చేశారు. ఎట్టకేలకు 7 గంటల ఆలస్యం తర్వాత ఫ్లైట్ లిథువేనియాకు చేరుకోవడంతో ప్రయాణికులైతే ఊపిరి పీల్చుకున్నారు గానీ ఆ యువకుడి పరిస్థితి ఏమౌతుందో అనే ఆలోచన వాళ్ల మెదళ్లను తొలచివేస్తోంది. ఈ ఘటనపై అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. యూరోపియన్ దేశాలు సహా అమెరికా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో తీరుపై తీవ్ర ఆగ్రహం చేస్తోంది. అసలు ఆ విమానాన్ని ఎందుకు ఆపారు? ఇందుకు బెలారస్ చెప్పిన కారణం ఏమిటి? ఇంతకీ ఆ యువకుడు ఎవరు? అతడిని ఎందుకు తీసుకువెళ్లారు? ఫొటో కర్టెసీ: రాయిటర్స్ ఎవరా యువకుడు? రోమన్ ప్రొటాసెవిక్.. జర్నలిస్టు. నెక్స్టా గ్రూపు మాజీ ఎడిటర్. గతేడాది బెలారస్లో జరిగిన ఆందోళనకు సంబంధించి వరుస కథనాలు ప్రచురించాడు. అందుకుగానూ అతడిపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఇప్పటికే రోమన్‌పై అనేక అభియోగాలు నమోదుకాగా.. ఎప్పుడెప్పుడు అతడిని అరెస్టు చేయాలా అన్న అలోచనలో ఉంది. దీంతో అతడు పొలాండ్‌లో తలదాచుకుంటున్నాడు. అయితే, ఆదివారం లిథువేనియాకు వెళ్లే క్రమంలో బెలారస్లో రోమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరణం తప్పదన్నాడు ఈ విషయం గురించి విమానంలో ఉన్న ప్రయాణికులు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అతడు భయంతో వణికిపోవడం నేను చూశాను. అతడి కళ్లు విషాదంతో నిండిపోవడం గమనించాను. ఇంతలో తను మా వైపు తిరిగి.. తాను మరణశిక్ష ఎదుర్కోబోతున్నట్లు చెప్పాడు. నిజానికి అతడు అరవడం లేదు, కానీ తను చాలా భయపడిపోతున్నట్లు అర్థమైంది. ఒకవేళ కిటికీ గనుక తెరిచే అవకాశం ఉంటే, కచ్చితంగా దూకేవాడేనేమో. తనను కిందకి తీసుకువెళ్లి ఏవేవో ప్రశ్నలు అడిగి తీసుకువెళ్లారు’’ అని పేర్కొన్నారు. హైడ్రామా.. ఏం చెప్పి విమానాన్ని ఆపారు? విమానంలో బాంబు ఉందన్న బెదిరింపులు రావడంతో అత్యవసరంగా మింక్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయాలంటూ బెలారస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సందేశం వచ్చింది. అంతలోనే ఓ యుద్ధ విమానం ఎస్కార్టుగా వస్తున్న విషయాన్ని ప్రయాణికులు గమనించారు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత సాధారణ తనిఖీ చేశారు. కానీ అందులో బాంబు ఉన్న ఆనవాలు కనిపించలేదు. కానీ, రోమన్‌ను బయటకు పిలిచారు. అతడితో పాటు ఓ మహిళను పోలీసులు తమతో పాటు తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని బెలారస్ అధికార మీడియా ధ్రువీకరించింది. ‘‘బాంబు బెదిరింపు రావడంతో మిస్టర్ లుకాషెంకో వ్యక్తిగత ఆదేశాలు జారీ చేశారు. విమానాన్ని మింక్లో ల్యాండ్ చేయాలని ఆదేశించారు. ఇందుకు మిగ్-29 ఫైటర్ ఎస్కార్టుగా ఉండేందుకు అనుమతించారు’’ అని పేర్కొంది. అయితే, అప్పటికే విమానం మింక్ కంటే కూడా, లిథువవేనియా విల్నూయిస్కే దగ్గరగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో బెలారస్ ఉద్దేశపూర్వకంగానే రోమన్ కోసం ఫ్లైట్‌ను మళ్లించి, బాంబు నాటకం ఆడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా రియాన్ ఎయిర్.. ప్రయాణికులను క్షమాపణ కోరుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే రోమన్ మద్దతుదారులు మాత్రం. ‘‘రియాన్ఎయిర్ ... రోమన్ ఎక్కడ’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫొటో కర్టెసీ: రాయిటర్స్ భగ్గుమంటున్న అంతర్జాతీయ సమాజం ఒక జర్నలిస్టును అరెస్టు చేసేందుకు బెలారస్ ఇంతటి సాహసానికి పూనుకోవడం సరికాదంటూ అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బెలారస్‌పై ఆంక్షలు విధించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన ఐక్యరాజ్య సమితి విమానయాన విభాగం ఐసీఏఓ.. బలవంతంగా విమానాన్ని ల్యాండ్ చేయించారు. ఇది చికాగో కన్వెన్షన్ నిబంధనలు ఉల్లంఘించడమే’’ అని పేర్కొంది. కాగా చికాగో కన్వెన్షన్‌లో గగనతలం, విమానాల సురక్షిత ప్రయాణాలకై పలు నిబంధనలు ఉన్నాయి. ‘‘సాధారణ పౌరులతో వెళ్తున్న విమానాన్ని ఇలా ఆపడం అంటే హైజాక్ చేసినట్లే. ఇంతటి దుస్సాహసానికి పూనుకున్న బెలారస్ కచ్చితంగా శిక్షను ఎదుర్కోవాల్సిందే’’ అని పోలండ్ ప్రధాని మండిపడ్డారు. ఇక బెలారస్‌లోని అమెరికా రాయబారి జూలీ ఫిషర్.. ‘‘అంతర్జాతీయ సమాజం, పౌరులకు వ్యతిరేకంగా లుకాషెంకో ప్రభుత్వం వ్యవహరించింది. బాంబు ఉందన్న అబద్ధపు సందేశంతో మిగ్-29ను పంపించి రేనార్ను మళ్లించింది. నెక్స్టా జర్నలిస్టుపై రాజకీయ కక్షతో నమోదైన అభియోగాల నేపథ్యంలో అతడిని అరెస్టు చేసేందుకు చేపట్టిన ఈ చర్య చాలా ప్రమాదకరం’’ అని ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇక లాటివియా, లిథువేనియా ఏకంగా బెలారస్ గగనతలాన్ని అసురక్షిత గగనతలంగా గుర్తించాలని విజ్ఞప్తి చేయడం విశేషం. రాజకీయ ప్యత్యర్థిని కిడ్నాప్ చేయడం కోసం వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టిన బెలారస్ గగనతలంలో అంతర్జాతీయ విమానాలు ప్రయాణించకుండా ఆంక్షలు విధించాలని సూచిస్తున్నాయి. కాగా ఈ ఘటనపై విచారణ జరిపే విధంగా అమెరికా యూరోపియన్ దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. Lukashenka and his regime today showed again its contempt for international community and its citizens. Faking a bomb threat and sending MiG-29s to force @RyanAir to Minsk in order to arrest a @Nexta journalist on politically motivated charges is dangerous and abhorrent. — Julie Fisher (@USAmbBelarus) May 23, 2021 Today’s hijacking of #Ryanair flight by Lukashenko regime shows that Belarusian airspace is not safe, people’s lives were put at risk and kidnaping of a political opponent took place. Belarusian airspace must be closed for all international flights. — Edgars Rinkēvičs (@edgarsrinkevics) May 23, 2021 -
వింత పోటీలో గెలిచిన లిథువేనియా జంట
ఫిన్లాండ్ : ఫిన్లాండ్ దేశం నిర్వహించిన 'వైఫ్ క్యారీంగ్' పోటీ టైటిల్‌ను లిథువేనియా దేశానికి చెందిన జంట గెలుచుకుంది. సొంకాజర్వీలో ఈ పోటిలో ఫ్రాన్స్, జర్మని ఆస్ట్రేలియాతో పాటు 12 దశాల నుంచి 12 జంటలు పాల్గొన్నాయి. వైటాటాస్ కిర్క్లియాస్కాస్, భార్య నెరింగా కిర్క్లియాస్కీన్లు 253.5 మీటర్ల దూరాన్నికేవలం 1 నిమిషం 6.72 సెకన్లలోనే పూర్తి చేసి చాంపియన్‌గా నిలిచారు. గెలిచిన ఈ జంటకి భార్య బరువుకు సమానంగా ఉండే బీరు బాటిల్‌ను హుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా కిర్క్లియాస్కాస్ మాట్లాడుతూ మేము గెలుస్తామని అనుకోలేదని, ఇది ఊహించని విజయమని అన్నారు. పోటిలో సెకండ్ స్టెజీకి వెళ్లాక నేను పరుగెత్తలెనేమో అనుకున్నాను, కాని నా భార్య ఇచ్చిన పోత్సాహంతోనే ఈ గెలుపు సాధ్యమైందని, తను ఏప్పుడూ నాకు ఉత్తమమైన భార్య అని అన్నారు. ఈ పోటిలో భర్త భార్యను ఎత్తుకుని ఓ పెద్ద కర్రపై నుంచి దూకుతూ వచ్చి నడుము లోతు వరకు ఉన్న నీటిలో పరుగెత్తాలి. అలాగే ఇందులో పోటి చేసే భార్య 17 ఏళ్ల వయస్సు ఉండి 49 కిలోల బరువు మాత్రమే ఉండాలి. ఇందులో పోటి చేసే జంట కచ్చితంగా వివాహితులై ఉండాలన్న నిబంధన లేదు, అవివాహితులు కూడా ఈ పోటిలో పాల్గోనవచ్చని ఈవెంట్ ఆర్గనైజర్లు తెలిపారు. -
సమ్మిళిత వృద్ధిలో అట్టడుగున భారత్!
దావోస్: సమ్మిళిత వృద్ధిలో పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్ల కన్నా కూడా భారత్ అట్టడుగు స్థాయిలో ఉంది. వర్ధమాన దేశాలకు సంబంధించిన సమ్మిళిత వృద్ధి సూచీలో 62వ స్థానంలో నిల్చింది. చైనా 26, పాకిస్తాన్ 47వ స్థానాల్లో ఉండటం గమనార్హం. వర్ధమాన దేశాల జాబితాలో లిథువేనియా అగ్రస్థానంలో నిల్చింది. సంపన్న దేశాల జాబితాలో అత్యంత సమ్మిళిత ఆర్థిక వ్యవస్థగా నార్వే అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. వార్షిక సదస్సు నేపథ్యంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ఈ సూచీ విశేషాలు విడుదల చేసింది. జీవన ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ, రుణభారాల నుంచి భవిష్యత్ తరాలను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్స్‌ని ఇచ్చినట్లు డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. ఆర్థిక అభివృద్ధికి జీడీపీ గణాంకాలే కొలమానంగా తీసుకోవడం స్వల్పకాలిక ధోరణులనే చూపుతోందని, అసమానతలకు ఆజ్యం పోస్తోందని తెలియజేసింది. ఈ నేపథ్యంలో సమ్మిళిత వృద్ధి సాధన కోసం ప్రపంచ దేశాల నేతలు మరో కొత్త విధానాన్ని తక్షణం కనుగొనాల్సిన అవసరం ఉందని సూచించింది. గతేడాది 79 దేశాల వర్ధమాన దేశాల జాబితాలో భారత్ 60వ స్థానంలో నిల్చింది. చైనా 15, పాకిస్తాన్ 52వ స్థానాల్లో నిలిచాయి. తాజాగా 2018 సూచీలో భారత్ 60వ స్థానం నుంచి 62 స్థానానికి పడిపోగా.. పాకిస్తాన్ మాత్రం 47వ స్థానానికి ఎగబాకింది. సమ్మిళిత వృద్ధి సూచీలో మొత్తం 130 దేశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో 29 సంపన్న దేశాలు, మిగతా 74 వర్ధమాన దేశాలు ఉన్నాయి. భారత్ ఓవరాల్ స్కోరు తక్కువగానే ఉన్నప్పటికీ.. పురోగమిస్తున్న టాప్ టెన్ వర్ధమాన దేశాల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది. ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం వల్లే.. సంపదపరంగానూ, ఆదాయాలపరంగానూ అసమానతలు పెరిగిపోవడానికి కారణం.. దశాబ్దాలుగా సామాజిక సమగ్రాభివృద్ధి కన్నా ఆర్థికాభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటమేనని డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. దీంతో వృద్ధి ఫలాలు అందరికి అందేలా చర్యలు తీసుకోవడం ద్వారా పర్యావరణాన్ని దెబ్బతియ్యకుండా, భవిష్యత్ తరాలపై రుణభారాన్ని మోపకుండా చూడగలిగే అవకాశాన్ని ప్రభుత్వాలు కోల్పోయాయని తెలిపింది. దేశ ఆర్థిక పనితీరును లెక్కగట్టేందుకు ఆర్థిక వేత్తలు, విధానకర్తలు ఎక్కువగా స్థూల దేశీయోత్పత్తి గణాంకాలపైనే ఆధారపడుతుండటం కూడా ప్రధాన సమస్యల్లో ఒకటని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. జీడీపీ కేవలం వస్తు, సేవల ఉత్పత్తి లెక్కింపునకు మాత్రమే పరిమితవుతుందే తప్ప.. అవి ఉద్యోగావకాశాలు, ఆర్థిక భద్రత, జీవన ప్రమాణాలు మెరుగుదలను ప్రతిఫలించదని వివరించింది. టాలెంట్ ర్యాంకింగ్ మెరుగు .. ప్రతిభావంతులను ఆకర్షించడంలో భారత్ ర్యాంకింగ్ మెరుగుపర్చుకుంది. గతేడాది 92వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి 81వ స్థానానికి ఎగబాకింది. టాలెంట్‌ను ఆకర్షించడంలో పోటీతత్వానికి సంబంధించిన సూచీ వివరాలను డబ్ల్యూఈఎఫ్ ప్రకటించింది. భారత్‌కి తీవ్రమైన మేధోవలస రిస్కు పొంచి ఉందని పేర్కొంది. స్విట్జర్లాండ్ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సింగపూర్, అమెరికా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మరిన్ని విశేషాలు.. ⇒సంపన్న దేశాల సమ్మిళిత వృద్ధి సూచీలో నార్వే టాప్‌లో ఉండగా, ఐర్లాండ్, లగ్జెంబర్గ్, స్విట్జర్లాండ్, డెన్మార్క్ టాప్ 5లో ఉన్నాయి. ⇒వర్ధమాన దేశాల్లో లిథువేనియా అగ్రస్థానంలో, హంగరీ, అజర్బైజాన్, లాత్వియా, పోలాండ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ⇒పొరుగు రాష్ట్రాలైన శ్రీలంక (40), బంగ్లాదేశ్ (34), నేపాల్ (22 వ ర్యాంకు) భారత్ కన్నా మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. -
వారికి ఎయిడ్స్ సోకదు!
విల్నియస్: ఎయిడ్స్.. ఇదో ప్రాణాంతక వ్యాధి. అయితే లిథువేనియా దేశానికి చెందిన కొందరికి మాత్రం ఎయిడ్స్ అంటే అస్సలు భయమే లేదు. ఎందుకంటే వారికి ఎయిడ్స్ అసలే సోకదు. హెచ్ఐవీ వైరస్ వారి శరీరంలోకి ప్రవేశించినా కూడా వారికి ఏమీ కాదని శాస్త్రవేత్తలు తేల్చేశారు. లిథువేనియా ప్రజల్లో దాదాపు 16 శాతం మందికి ఎయిడ్స్ నిరోధకత కలిగి ఉందని చెబుతున్నారు. ఎందుకంటే వారి జన్యువులు పలు పరివర్తనాలు (జీన్ మ్యుటేషన్) చెందడం వల్ల వారి నిరోధక వ్యవస్థలోకి ఎయిడ్స్ వైరస్ ప్రవేశించి నాశనం చేయలేదని వెల్లడించారు. వీరి జన్యువులను అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలకు ఎయిడ్స్ వ్యాధి చికిత్స పద్ధతులు తెలుసుకునే అవకాశం కలగనుంది. -
హిల్ ఆఫ్ క్రాసెస్!
లిథువేనియాలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన సాయవుయైలో ఉంది ‘హిల్ ఆఫ్ క్రాసెస్’. ‘సాయవు’ అంటే లిథువేనియా భాషలో ‘సూర్యుడు’ అని అర్థం. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఈ నగరంలో సైకిల్ మ్యూజియం, చాక్లెట్ మ్యూజియం, రేడియో అండ్ టెలివిజన్ మ్యూజియం, క్యాట్ మ్యూజియం, నేషనల్ డాల్స్ మ్యూజియం, రైల్వే మ్యూజియం వంటి ఆకర్షణలు చాలా ఉన్నాయి. అలాగే ఎక్కడ చూసినా అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి. వీటన్నిటికీ తోడు ‘హిల్ ఆఫ్ క్రాసెస్’ కూడా ఉండటంతో... ప్రముఖ పర్యాటక నగరంగా వెలుగొందుతోంది. ఆ కొండకు దగ్గరవుతున్న కొద్దీ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక తీరాలకు చేరువవుతున్నట్లుగా ఉంటుంది. అభయ హస్తమేదో మనకోసం చేయి చాస్తున్నట్లు ఉంటుంది. ఇక కళాప్రేమికులకైతే అక్కడి దృశ్యాలు సర్రియలిస్ట్క్ చిత్రాల్లా కనిపిస్తాయి. ఇన్ని ప్రత్యేకతలు గల ఆ ప్రదేశం... లిథువేనియాలో ఉంది. అదే ‘ద హిల్ ఆఫ్ క్రాసెస్’. ఈ పవిత్రకొండపై ఒక శిలువను నాటి, మనసులోని కోరికను రాసిన చీటీని ఆ శిలువకు తగిలించి, ఓ క్షణం పాటు ప్రార్థిస్తే ఆ కోరిక నెరవేరుతుందట. ‘నాన్నను మద్యపానం నుంచి దూరం చెయ్యి ప్రభూ’/‘చాలా కష్టపడి పరీక్షలకు ప్రిపేరవుతున్నాను. నీ ఆశీస్సులు కావాలి తండ్రీ’/‘అమ్మ చనిపోయిన దుఃఖం నుంచి తేరుకోకుండా ఉన్నాను... నా మనసుకు శాంతి కలిగించు దేవా.’ ‘హిల్ ఆఫ్ క్రాసెస్’పై ఉన్న లక్షలాది శిలువలకు వేళ్లాడే కాగితాలు, కాగితాలుగా మాత్రమే కనిపించవు. ఎన్నో హృదయాల స్పందనలా అనిపిస్తాయి. నిజానికి ఈ కొండ అసలు పేరేమిటి, దీని మీదికి ఇన్ని శిలువలు ఎందుకు వచ్చాయి, వాటిని పాతడం ఎప్పుడు మొదలైంది, ఎవరితో మొదలైంది అన్న విషయాలు ఎవరికీ స్పష్టంగా తెలియవు. కాకపోతే కొన్ని కథనాలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. 1831లో రష్యన్లకు వ్యతిరేకంగా పోలిష్, లిథువేనియా సైన్యాలు పోరా డాయి. యుద్ధంలో చాలామంది లిథు వేనియా సైనికులు మరణించారు. అయితే వారిలో చాలామంది మృతదేహాలు మాయమయ్యాయి. తమవాళ్లను చివరి సారిగానైనా చూసుకోలేకపోవడం ఆత్మీయులను కలచివేసింది. దాంతో మృతుల ఆత్మలకు శాంతి కలిగేందుకు ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు. ఈ కొండమీదికి వెళ్లి తమవారికి గుర్తుగా శిలువలను పాతారు. వారి ఆత్మకు శాంతి కలగాలంటూ చీటీల మీద రాసి, శిలువలకు అతికించి, ప్రార్థించి వచ్చారు. అప్పటి నుంచి చనిపోయిన తమవారి ఆత్మకు శాంతి చేకూరేలా శిలువ నాటడం ఆచారంగా మారిందనేది ఒక కథనం. మరో కథనం ప్రకారం... ఒకానొక కాలంలో లిథువేనియాలో ఒక రైతు కూతురు జబ్బు పడి మృత్యువుకు చేరువయిందట. ఎందరు వైద్యులకు చూపించినా ఫలితం లేకపోయింది. ఒక రాత్రి అతడి కలలో తెలుపు దుస్తులు ధరించిన ఒక స్త్రీ ప్రత్యక్షమై... చెక్కతో తయారుచేసిన పెద్ద శిలువను దేశమంతా ఊరేగించి కొండపై నిలిపితే అమ్మాయి కోలుకుంటుందని చెప్పింది. రైతు అలానే చేశాడు. తర్వాత కొద్ది రోజులకే అమ్మాయి కోలుకుందట. ఇక అప్పటి నుంచి ప్రజలు తమకు సమస్య ఎదురైనప్పుడు, తమ మనసులోని మాటను దైవంతో చెప్పుకో వాలనుకున్నప్పుడు కొండపై శిలువను నాటడం ఆచారంగా మారిపోయిందట. మొదలైంది ఎప్పుడైనా ఎలాగైనా కానీ... ప్రస్తుతం ‘హిల్ ఆఫ్ క్రాసెస్’ ఓ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోయింది. 1993లో రెండవ పోప్ జాన్ పాల్ ఈ కొండను దర్శించి, ‘హిల్ ఆఫ్ క్రాసెస్’ గురించి గొప్పగా ప్రసంగించడంతో మరింత ప్రాచుర్యం పొందింది. ప్రపంచం నలుమూలల నుంచీ లక్షలాది మంది వచ్చి, తమ కష్టాలు తొలగాలని, కోరికలు తీరాలని శిలువలు పాతి ప్రార్థిస్తున్నారు. వీరందరి కోసం కొండ సమీపంలోని చిన్న చిన్న దుకాణాలలో శిలువలు అమ్ముతారు. చీటీలు రాయడానికి పెన్నులు, కాగితాలు కూడా అందుబాటులో ఉంచుతారు. నిజానికి ఇక్కడకు వచ్చేవారిలో కేవలం క్రైస్తవులే కాకుండా అన్ని మతాల వారూ ఉంటారు. భక్తి, నమ్మకం అనేవి ఒక్క మతానికి చెందినవి కావని, సర్వమతాలూ సమానమేనని ‘హిల్ ఆఫ్ క్రాసెస్’కి వచ్చేవారి ద్వారా మరోసారి నిరూపణ అయ్యింది! -
ఈ గెడ్డం దృఢమైనది..
లిథువేనియాకు చెందిన ఆంతనాస్ కోంత్రియాస్ బలం ఆయన కండల్లో లేదు. గెడ్డంలో ఉంది. దానికి ఉదాహరణే ఈ చిత్రం. ఈయన తన గెడ్డంతో ఏకంగా 63.8 కిలోలున్న అమ్మాయిని ఎత్తేశాడు. దీంతో గిన్నిస్ వారు కూడా ఆయన గెడ్డానికి సలాం కొడుతూ.. ప్రపంచ రికార్డును కట్టబెట్టేశారు. ఇది జరిగింది 2013లో.. అయితే.. దీన్ని తమ ఫేవరేట్స్‌లో ఒకటిగా పేర్కొంటూ 60వ వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల విడుదలైన 2015 గిన్నిస్ బుక్‌లో ఈ రికార్డుకూ చోటు కల్పించారు.