ఫిన్‌లాండ్ : ఫిన్‌లాండ్ దేశం నిర్వహించిన 'వైఫ్ క్యారీంగ్' పోటీ టైటిల్‌ను లిథువేనియా దేశానికి చెందిన జంట గెలుచుకుంది. సొంకాజర్వీలో ఈ పోటిలో ఫ్రాన్స్, జర్మని ఆస్ట్రేలియాతో పాటు 12 దశాల నుంచి 12 జంటలు పాల్గొన్నాయి. వైటాటాస్ కిర్క్లియాస్కాస్, భార్య నెరింగా కిర్క్లియాస్కీన్లు 253.5 మీటర్ల దూరాన్నికేవలం 1 నిమిషం 6.72 సెకన్లలోనే పూర్తి చేసి చాంపియన్‌గా నిలిచారు. గెలిచిన ఈ జంటకి భార్య బరువుకు సమానంగా ఉండే బీరు బాటిల్‌ను హుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా కిర్క్లియాస్కాస్ మాట్లాడుతూ మేము గెలుస్తామని అనుకోలేదని, ఇది ఊహించని విజయమని అన్నారు. పోటిలో సెకండ్ స్టెజీకి వెళ్లాక నేను పరుగెత్తలెనేమో అనుకున్నాను, కాని నా భార్య ఇచ్చిన పోత్సాహంతోనే ఈ గెలుపు సాధ్యమైందని, తను ఏప్పుడూ నాకు ఉత్తమమైన భార్య అని అన్నారు.
ఈ పోటిలో భర్త భార్యను ఎత్తుకుని ఓ పెద్ద కర్రపై నుంచి దూకుతూ వచ్చి నడుము లోతు వరకు ఉన్న నీటిలో పరుగెత్తాలి. అలాగే ఇందులో పోటి చేసే భార్య 17 ఏళ్ల వయస్సు ఉండి 49 కిలోల బరువు మాత్రమే ఉండాలి. ఇందులో పోటి చేసే జంట కచ్చితంగా వివాహితులై ఉండాలన్న నిబంధన లేదు, అవివాహితులు కూడా ఈ పోటిలో పాల్గోనవచ్చని ఈవెంట్ ఆర్గనైజర్‌లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment