ప్రతీకాత్మక చిత్రం
లండన్ : తరచూ తక్కువ మోతాదులో బాదం, జీడిపప్పు వంటి నట్స్ తీసుకునేవారిలో అసాధారణంగా గుండె కొట్టుకునే రిస్క్ గణనీయంగా తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. వారానికి మూడు సార్లు నట్స్ తింటే స్ర్టోక్‌కు దారితీసే అసాధారణ హార్ట్ బీట్ ముప్పును 18 శాతం మేర తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. అయితే ఎక్కువగా నట్స్‌ను తీసుకోరాదని, పరిమితంగా వీటిని తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు 60,000 మందిని 17 ఏళ్ల పాటు పరిశీలించి నట్స్ వినియోగం, వారి గుండె ఆరోగ్యాన్ని గమనించారు.
నట్స్ వినియోగంతో గుండె పోటు, స్ర్టోక్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని ప్రాథమికంగా నిర్థారించారు. నట్స్ వినియోగం పెరిగిన కొద్దీ అసాధారణంగా గుండె కొట్టుకోవడం, గుండె వైఫల్యం వంటి రుగ్మతల రిస్క్ తగ్గినట్టు వెల్లడైందని పరిశోధకులు తెలిపారు. అథ్యయన వివరాలు జర్నల్ హార్ట్‌లో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment