లండన్ : ప్రొటీన్ అధికంగ ఉండే ఆహారం తీసుకునేవారిలో గుండె వైఫల్యం ముప్పు 50 శాతం తక్కువగా ఉంటుందని తాజా అథ్యయనం వెల్లడించింది. 2000 మందికి పైగా వారు తీసుకునే ప్రొటీన్ స్ధాయి, వారి గుండె ఆరోగ్యాన్ని అథ్యయనంలో భాగంగా పరిశీలించారు. తక్కువ ప్రొటీన్ తీసుకునే వారు అధికంగా ప్రొటీన్‌ను తీసుకునే వారితో పోలిస్తే మృత్యువాతన పడే ముప్పు 46 శాతం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.
రోజుకు 70 గ్రాములు ప్రొటీన్ తీసుకుంటే అకాల మరణం నుంచి 50 శాతం మేర తప్పించుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు. ప్రొటీన్‌తో శరీరంలో కండరాలు పటిష్టమై గుండె పదికాలాలు దృఢంగా ఉండేలా చేస్తుందని భావిస్తున్నారు. నట్స్, గుడ్లు, మాంసంలో ప్రొటీన్ అధికంగా లభ్యమవుతుంది. యూనివర్సిటీ మెడికల్ సెంటర్ గ్రొనిజెన్ చేపట్టిన ఈ పరిధశోధనను వియత్నాంలో హృదయవైఫల్యంపై జరిగిన వరల్డ్ కాంగ్రెస్‌లో సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment