లండన్ : కంటి నిండా నిద్ర కరవైతే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని పలు పరిశోధనలు తేల్చగా..చాలినంత నిద్ర ఉన్నా ఏకబిగిన నిద్రపోకుండా తరచూ నిద్ర వేళల్లో మార్పులతో అధిక రక్తపోటు, మధుమేహం, స్ధూలకాయం వంటి జీవన శైలి వ్యాధులు చుట్టుముడతాయని తాజా అథ్యయనం స్పష్టం చేశారు. మనం విశ్రాంతి తీసుకోవడం, జీవక్రియల వేగం వంటి అంశాలను జీవ గడియారం నియంత్రిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. నిద్ర వేళల్లో మార్పులు జీవక్రియలను విచ్ఛిన్నం చేస్తాయని ఫలితంగా ఈ వ్యాధుల బారిన పడే అవకాశం ఉదని బ్రిగమ్, వుమెన్స్ హాస్పిటల్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అథ్యయనం వెల్లడించింది.
రోజూ ఒకే సమయంలో నిద్ర వేళలను మెయింటెన్ చేస్తే జీవక్రియల సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా కుంగుబాటును నిరోధించడంతో పాటు హృదయ ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. 45 ఏళ్ల నుంచి 84 ఏళ్ల మధ్య వయసు కలిగిన 2000 మందికి పైగా స్త్రీ, పురుషుల నిద్ర అలవాట్లు, వారి ఆరోగ్య పరిస్ధితిని ఆరేళ్ల పాటు పరిశీలించిన అనంతరం పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు. రోజూ నిద్ర వేళలను ఒకే విధంగా ఉండేలా కచ్చితంగా పాటిస్తే జీవక్రియల ఫలితాలు మెరుగ్గా ఉంటాయని అథ్యయన సహ రచయిత డాక్టర్ సుసాన్ రెడ్‌లైన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment