sleeplessness
-
ఆర్టీసీలో ‘మానసిక’ టెన్షన్!
ముందు రోజు రాత్రివిధులు నిర్వహించి వచ్చాడు ఆ డ్రైవర్.. మరుసటి రోజు రాత్రి విధులకు వెళ్లేలోపు కనీసం నాలుగు గంటలన్నా నిద్రపోవాలి.. కానీ దగ్గరి బంధువుల ఇంట్లో వేడుకకు వెళ్లాల్సి ఉంది, సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో పగటి పూట వేడుకలో గడిపి, 110 కి.మీ. దూరంలోని తానుంటున్న పట్టణం నుంచి సొంత వాహనం నడుపుకుంటూ హైదరాబాద్ వచ్చి విజయవాడ బస్సు తీసుకుని బయలుదేరాడు. దారిలో ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనటంతో మృతి చెందాడు. మరో 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ డ్రైవర్ కొన్నేళ్లుగా కుటుంబ వివాదాలతో సతమతమవుతున్నాడు.. దాదాపు కుటుంబ సభ్యులు వెలివేసినంత పనిచేశారు.. దీంతో అతని మానసిక స్థితి అదుపు తప్పింది. దూరప్రాంత బస్సు కావటంతో ఇద్దరు డ్రైవర్లు విధుల్లో ఉంటున్నారు. మరో డ్రైవర్ నడుపుతున్నప్పుడు అతను మద్యం సేవిస్తున్నాడు. ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేయగా, ఆ రోజు అధికంగా మద్యం తాగి ఉన్నట్టు తేలి అధికారులు కంగుతిన్నారు. అప్పుడు కాని అతన్ని విధుల నుంచి తప్పించలేదు. సాక్షి, హైదరాబాద్: ఇది తెలంగాణ ఆర్టీసీలో నెలకొన్న పరిస్థితి. సగటున ఒక్కో బస్సులో 60 మందికిపైగా ప్రయాణికులు ఉంటారు. వారిని క్షేమంగా గమ్యం చేర్చేది డ్రైవరే. కానీ, ఇప్పుడు ఆర్టీసీకి డ్రైవర్లపై పర్యవేక్షణే లేకుండా పోయింది. డ్రైవర్ భద్రంగా బస్సును గమ్యం చేర్చటమనేది డ్రైవింగ్ స్కిల్స్ పైనే కాకుండా, అతని మానసిక స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే గతంలో డ్రైవర్‌పై నిఘా, పర్యవేక్షణ ఉండేది. కానీ, క్రమంగా నష్టాలను అధిగమించేందుకు ఆదాయంపైనే దృష్టి కేంద్రీకరించటం మొదలయ్యాక ఇది గతి తప్పింది. ఇప్పుడు డ్రైవర్ల కొరత కూడా ఉండటంతో, కచ్చి తంగా ఉన్నంత మంది విధులకు వచ్చేలా చూడ్డానికే అధికారులు పరిమితమవుతున్నారు. వారికి గతంలోలాగా సెలవులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో విధులు ముగిసిన తర్వాత నుంచి తిరిగి విధులకు వచ్చే వరకు ఆ డ్రైవర్ విషయాన్ని సంస్థ పట్టించుకోవటం లేదు. డ్యూటీకి వచ్చే సమయానికి అతని మానసిక స్థితి ఏంటో కూడా తెలుసుకోలేకపోతున్నారు. మద్యం తాగి ఉన్నాడా లేదా అన్న ఒక్క విషయాన్ని మాత్రమే తేల్చుకుని బస్సు అప్పగిస్తున్నారు. సెలవులు లేక.. ఒంట్లో కాస్త నలతగా ఉన్నా, విశ్రాంతి సమయంలో నిద్రపోలేని పరిస్థితిలో ఉన్నా, రకరకాల వివాదా లతో మానసికంగా ఆందోళనతో ఉన్నా.. డ్రైవింగ్ సరిగా చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో తనకు సెలవు కావాలంటూ డ్రైవర్లు అడుగుతారు. అయితే, సెలవు ఇస్తే డ్రైవర్ల కొరత వల్ల సరీ్వసునే రద్దు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో వా రికి సెలవుల్లేక విధులకు హాజరు కావాల్సి వస్తోంది. విజయవాడ మార్గంలో జరిగిన యాక్సిడెంట్లో చనిపోయిన డ్రైవర్.. ఆ రోజు నిద్రలేమితో ఉండి కూడా సెలవుకు దరఖాస్తు చేయకుండా డ్యూటీకి హాజరయ్యాడని తెలిసింది. ఆ విధానమేమైంది..? గతంలో ప్రతి డిపోలో స్పేర్ డ్రైవర్లు ఉండేవారు. డ్యూటీ చేయలేని స్థితిలో డ్రైవర్ ఉంటే అతని స్థానంలో మరో డ్రైవర్‌ను పంపే వారు. కానీ 13 ఏళ్లుగా డ్రైవర్ల రిక్రూట్మెంట్ లేకపోవటం, రిటైర్మెంట్లు, మరణించడం, పదోన్నతులు.. వంటి కారణాల వల్ల డ్రైవర్లకు కొరత ఏర్పడింది. గతంలో డ్రైవర్ల మానసిక స్థితిని తెలుసుకునే విధానం ఉండేది. ఏవైనా కారణాలతో వారు మానసికంగా కుంగిపోతున్నారా అన్నది సంస్థకు తెలిసే ఏర్పాటు ఉండేది. ప్రతి సంవత్సరారంభంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేవారు. వాటికి డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా డ్రైవర్ల స్థితిగతులపై ఆర్టీసీకి సమాచారం చేరేది. డ్రైవర్లతోపాటు, వారి కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ చేసేవారు. డ్యూటీకి–డ్యూటీకి మధ్య చాలినంత నిద్ర ఉండేలా చూడాలంటూ కుటుంబ సభ్యులకు సూచించేవారు. ఇప్పుడు ఆ వారోత్సవాలు సరిగా నిర్వహించటం లేదు. సంవత్సరంలో ఒకసారి ప్రమాదరహిత వారోత్సవాలు నిర్వహించేవారు. ఆ వారంలో ఒక్క బస్సు కూడా ప్రమాదానికి గురి కాకుండా డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలుండేవి. ఇది కూడా వారి నైపుణ్యం, మానసిక స్థితి తెలుసుకునేందుకు ఉపయోగపడేది. ఇప్పుడు దీన్ని నిర్వహించటం లేదు. వరుస ప్రమాదాలతో.. చాలా విరామం తర్వాత మళ్లీ ఆర్టీసీ డ్రైవర్ల కుటుంబ సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. ఇటీవలి వరుస ప్రమాదాలతో సంస్థలో టెన్షన్ నెలకొంది. డ్యూటీకి వచ్చేప్పుడు సరైన స్థితితో డ్రైవర్లు ఉండేలా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులది అని అధికారులు చెబుతున్నారు. వారు రెస్ట్ సమయంలో తగినంతగా నిద్రపోవటం, సెల్ఫోన్లతో ఎక్కువ సేపు గడపకుండా చూడటం, అనవసర వివాదాలతో ఒత్తిడికి గురికాకుండా చూడటం.. లాంటి అంశాలపై కుటుంబ సభ్యులు దృష్టి సారించాలని చెప్పనున్నారు. కానీ, గతంలో ఉన్నట్టు పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేస్తే తప్ప ఇది ఫలించే సూచనలు కనిపించటం లేదు. డ్రైవర్లపై పని ఒత్తిడి తగ్గటంతోపాటు డ్రైవింగ్ చేయలేని పరిస్థితి ఉంటే సెలవు ఇచ్చే ఏర్పాటు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అది జరగాలంటే, తాత్కాలిక పద్ధతిలోనైనా డ్రైవర్ల రిక్రూట్మెంట్ ఉండాలని వారు పేర్కొంటున్నారు. -
నిద్రపట్టక రాత్రుళ్లు లేడీస్ హాస్టల్లోనే తిరుగుతూ..
భువనేశ్వర్: ఇప్పుడున్న ఒత్తిళ్లలో ఆందోళన, ఇతర మానసిక సమస్యలు తలెత్తడం సహజంగా మారింది. అయితే వాటికి పరిష్కారాలు వైపు వెళ్లకుండా.. తీవ్ర నిర్ణయాలు తీసుకుంటోంది నేటి తరం. తాజాగా ఓ అమ్మాయి.. నిద్ర కారణంతో అఘాయిత్యానికి పాల్పడి తల్లిదండ్రులకు శోకం మిగిల్చింది. గత కొన్నిరోజులుగా నర్సింగ్ చదువుతున్న ఆ అమ్మాయి నిద్రపోవట్లేదు. రాత్రిళ్లు హాస్టల్లో తిరుగుతూ అందరిలో ఆందోళన రేకెత్తించింది. అందుకే ఆమెను ఇంటికి తీసుకెళ్లాలని, అప్పుడైనా మామూలుగా అవుతుందేమో చూడాలని తల్లిదండ్రులకు సమాచారం అందించారు హాస్టల్ నిర్వాహకులు. కానీ, ఇంతలోనే.. ఒడిశా బాలోంగిర్‌కు చెందిన 19 ఏళ్ల అమ్మాయి.. భువనేశ్వర్ జముకోలిలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. అయితే గత కొన్నిరోజులుగా ఆమెకు కంటి నిండా నిద్ర పట్టడం లేదట. ఈ కారణంతోనే రాత్రిళ్లు హాస్టల్లో తిరుగుతూ మిగతా వాళ్లను ఇబ్బంది పెడుతోంది. ఇది గమనించిన నిర్వాహకులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చేలోపే ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, నిద్ర పట్టకపోవడమే సమస్య అని, తల్లిదండ్రులు తనను క్షమించాలంటూ లేఖలో పేర్కొందామె. ఫోరెన్సిక్ నిపుణులు అది ఆమె చేతిరాతేనని నిర్ధారించారు. ఈ కారణంతో ఆమె చనిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
వింత జబ్బు: 40 ఏళ్లుగా నిద్రపోని మహిళ
బీజింగ్: సాధారణంగా ఒక్కరోజు సరిగా నిద్రపోకపోతేనే ఆ ప్రభావం మన మీద చాలా దారుణంగా ఉంటుంది. రోజంతా చిరాకుగా... నిరుత్సాహంగా సాగుతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న పని వాతావారణం, సాంకేతికత మన శరీర పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దాంతో రాత్రి ఎంత సమయం గడిచినా ఓ పట్టాన నిద్రపట్టదు చాలా మందికి. మనకు వచ్చే చాలా అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం సరైన నిద్ర లేకపోవడం. ఇక నిద్రలేమితో బాధపడేవారు వైద్యులను సంప్రదించి.. చికిత్స తీసుకుని సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే ఈ వార్త ఇందుకు పూర్తిగా భిన్నమైనది. ఎందుకంటే ఇక్కడ ఓ మహిళ ఏకంగా 40 ఏళ్ల నుంచి నిద్ర పోవడం లేదు. ఎంత ప్రయత్నించినా ఆమెకు నిద్ర పట్టడం లేదట. నిద్రమాత్రలు వేసుకున్నప్పటికి ప్రయోజనం లేదని వాపోతుంది. ఆ వివరాలు.. చైనా హెనాన్ ప్రావిన్స్‌లో నివసించే లి జ్యానింగ్ అనే మహిళ(45) గత 40 ఏళ్లుగా ఇలా నిద్రలేమి సమస్యతో బాధపడుతుంది. ఈ వింత జబ్బు ఆమెని ఒక్క సెకను కూడా నిద్రపోనివ్వడం లేదట. తనకు 5-6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బాగా నిద్రపోయినట్లు గుర్తుందని.. ఆ తర్వాత ఈ వింత వ్యాధి బారిన పడటంతో ఇప్పటి వరకు ఒక్క క్షణం కూడా నిద్రపోలేదని తెలిపింది జ్యానింగ్. (చదవండి: నిద్ర సరిగ్గా పట్టడం లేదా? ఒత్తిడిని తగ్గించి మరీ నిద్రపుచ్చుతుంది ) ఈ విషయాన్ని జ్యానింగ్ భర్త కూడా అంగీకరించాడు. పెళ్లైన నాటి నుంచి ఇప్పటివరకు జ్యానింగ్ నిద్రపోవడం తాను చూడలేదన్నాడు. రాత్రంతా మెలకువగా ఉండటంతో టైం పాస్ కోసం ఇంటి పనులు చేయడం, టీవీ చూస్తూ గడుపుతుందన్నాడు. ఇక ప్రారంభంలో భార్యను ఈ సమస్య నుంచి బయటపడేయడం కోసం జ్యానింగ్ భర్త నిద్ర మాత్రలు కూడా తీసుకువచ్చాడట. కానీ అవి కూడా ఆమె మీద పెద్దగా ప్రభావం చూపకపోవడంతో.. వాటిని వాడటం మానేసిందట. (చదవండి: రాత్రి బాగా పొద్దుపోయాక నిద్రపోతే.. ఈ సమస్యలు తప్పవు!) ఈ వింత జబ్బు వల్ల జ్యానింగ్ తన గ్రామంలో చాలా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా జ్యానింగ్ను టెస్ట్ చేయడం కోసం చాలా మంది రాత్రి పూట ఆమె ఇంటికి వచ్చి.. పేకాట ఆడుతూ ఉండేవారు. అలా ఆడుతూనే వారికి తెలియకుండా నిద్రలోకి జారుకునేవారు. కానీ జ్యానెంగ్ మాత్రం అలానే మెలకువగా ఉండేదట. సమస్య పరిష్కారం కోసం జ్యానెంగ్ ఎన్నో ఆస్పత్రులను సందర్శించింది.. ఎందరో వైద్యులను కలిసింది. కానీ ఆమె సమస్యకు మాత్రం పరిష్కారం లభించలేదు. (చదవండి: నిద్ర పట్టడం లేదా..? ఇవి చేస్తే ఈజీగా..) అయితే సాధారణంగా వారం రోజుల కంటే ఎక్కువ సమయం ఎవరు నిద్ర పోకుండా బతకలేరు. అలాంటిది జ్యానెంగ్ ఇన్నేళ్లు నిద్ర పోకుండా ఉంది అనే వార్తలను జనాలు పెద్దగా నమ్మడం లేదు. బహుశా ఆమెకు రాత్రి నిద్ర పట్టకపోవచ్చు.. పగటి పూట నిద్ర పోతుండవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. -
నిద్ర సమస్యలతో ఆ వ్యాధుల ముప్పు..
లండన్ : నిద్రలేమి, అతినిద్రతో సతమతమయ్యేవారు రోజుకు ఏడు గంటలు నిద్రించేవారితో పోలిస్తే ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు పల్మనరీ ఫైబ్రోసిస్ బారిన పడే ముప్పు అధికమని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. రోజుకు 11 గంటలకు పైగా నిద్రించేవారు, నాలుగు గంటల కన్నా తక్కువ సమయం నిద్రించేవారు ఇతరులతో పోలిస్తే రెండు, మూడు రెట్లు అధికంగా ఈ వ్యాధి బారిన పడతారని అథ్యయనం హెచ్చరించింది. ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతింటే ఆ అవయవం సరిగ్గా పనిచేయడం కష్టమవడం పల్మనరీ ఫైబ్రోసిస్‌కు దారితీస్తుంది. మానవ శరీరంలోని అన్ని కణాలను జీవ గడియారం నియంత్రిస్తుందని, జీవ గడియారం సక్రమంగా నడవాలంటే సరైన నిద్ర అవసరమని మాంచెస్టర్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. నిద్ర లేమి, అతినిద్రతో జీవగడియారం పనితీరు అపసవ్యమై అనర్ధాలకు దారితీస్తుందని ముఖ్యంగా ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం పల్మనరీ ఫైబ్రోసిస్ నయం కాని వ్యాధిలా ముంచుకొస్తోందని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ ప్రొఫెసర్ జాన్ బ్లాక్లీ తెలిపారు. పల్మనరీ ఫైబ్రోసిస్‌కు నిద్రించే సమయానికి మధ్య సంబంధంపై మరింత పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అథ్యయనంలో వెల్లడైన అంశాలు నిర్ధారణ అయితే నిద్ర సమస్యలను అధిగమించడం ద్వారా ఈ కిల్లర్ డిసీజ్ ప్రభావాన్ని తప్పించుకోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. -
నిద్రలేమితో జీవనశైలి వ్యాధులు
లండన్ : కంటి నిండా నిద్ర కరవైతే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని పలు పరిశోధనలు తేల్చగా..చాలినంత నిద్ర ఉన్నా ఏకబిగిన నిద్రపోకుండా తరచూ నిద్ర వేళల్లో మార్పులతో అధిక రక్తపోటు, మధుమేహం, స్ధూలకాయం వంటి జీవన శైలి వ్యాధులు చుట్టుముడతాయని తాజా అథ్యయనం స్పష్టం చేశారు. మనం విశ్రాంతి తీసుకోవడం, జీవక్రియల వేగం వంటి అంశాలను జీవ గడియారం నియంత్రిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. నిద్ర వేళల్లో మార్పులు జీవక్రియలను విచ్ఛిన్నం చేస్తాయని ఫలితంగా ఈ వ్యాధుల బారిన పడే అవకాశం ఉదని బ్రిగమ్, వుమెన్స్ హాస్పిటల్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అథ్యయనం వెల్లడించింది. రోజూ ఒకే సమయంలో నిద్ర వేళలను మెయింటెన్ చేస్తే జీవక్రియల సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా కుంగుబాటును నిరోధించడంతో పాటు హృదయ ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. 45 ఏళ్ల నుంచి 84 ఏళ్ల మధ్య వయసు కలిగిన 2000 మందికి పైగా స్త్రీ, పురుషుల నిద్ర అలవాట్లు, వారి ఆరోగ్య పరిస్ధితిని ఆరేళ్ల పాటు పరిశీలించిన అనంతరం పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు. రోజూ నిద్ర వేళలను ఒకే విధంగా ఉండేలా కచ్చితంగా పాటిస్తే జీవక్రియల ఫలితాలు మెరుగ్గా ఉంటాయని అథ్యయన సహ రచయిత డాక్టర్ సుసాన్ రెడ్‌లైన్ చెప్పారు. -
నిద్రలేమితో ముంచుకొచ్చే ముప్పులివే..
న్యూయార్క్ : నిద్రలో తరచూ లేస్తూ, మళ్లీ నిద్రించేందుకు సతమతమయ్యే వారు గుండె పోటు, స్ట్రోక్‌కు గురయ్యే ముప్పు అధికమని తాజా అథ్యయనం వెల్లడించింది. తరచూ నిద్రాభంగానికి లోనయ్యే వారి గుండె కొట్టుకోవడం లయ తప్పి హృదయ సంబంధ వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరించింది. కంటినిండా నిద్ర కరవైన వారిలో గుండె క్రమపద్ధతిలో కొట్టుకోవడానికి ఆటంకం కలుగుతుందని, ఇది శరీరంపై ఒత్తిడి పెంచుతుందని అమెరికన్ పరిశోధకులు గుర్తించారు. కోటి 40 లక్షల మందిపై జరిపిన అథ్యయనంలో రాత్రి వేళల్లో నిద్రలేమితో బాధపడేవారిలో గుండె కొట్టుకునే వేగంలో అసాధారణ మార్పులు చోటుచేసుకునే ముప్పు మూడోవంతు అధికమని వెల్లడైంది. నిద్రలేమితో గుండె వ్యాధులు, స్ర్టోక్ ముప్పు అధికమని తొలిసారిగా వెల్లడైన ఈ అథ్యయన వివరాలు జర్నల్ హార్ట్ రిథమ్‌లో ప్రచురితమయ్యాయి. -
నిద్ర మధ్యలో వాట్సప్ మోగితే..?
మీరు అప్పుడే నిద్రలోకి జారుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో ఏ చిన్న అలికిడి అయినా వెంటనే మెలకువ వచ్చేస్తుంది. మరి అలాంటప్పుడు వాట్సప్‌లో ఏదైనా సందేశం వచ్చినట్లు నోటిఫికేషన్ వస్తే ఏం చేస్తారు? కొన్ని గ్రూప్‌ల మెసేజ్‌లైతే మ్యూట్‌లో పెట్టుకోవచ్చు. అలా కాకుండా కాంటాక్టుల నుంచి వచ్చేవైతే మాత్రం తప్పనిసరిగా మోత తప్పదు. ఎంత కాదనుకున్నా దానివల్ల నిద్రాభంగం తప్పదు. ఇలా ఒక్క వాట్సప్ మాత్రమే కాదు, అనేక రకాల యాప్స్‌ను ఫోన్లలో వేసుకోవడం వల్ల వాటి నుంచి వచ్చే నోటిఫికేషన్ల కారణంగా సగటున ఒక్కొక్కరికి గంటన్నర చొప్పున నిద్ర ఉండట్లేదని దక్షిణభారత దేశంలోనే ప్రముఖ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్హాన్స్) వైద్యులు చెప్పారు. ఫేస్బుక్ లేదా వాట్సప్, ఇతర న్యూస్ యాప్‌లు వాడటం వల్ల రోజుకు నీసం వంద నిమిషాల నిద్ర హుష్ కాకి అవుతోందని తమ పరిశోధనలలో తేలిందన్నారు. ప్రతిరోజూ నిద్రపోయే సమయం ఆలస్యం కావడంతో పాటు.. నిద్రమధ్యలో కూడా లేస్తున్నారని, దీనివల్ల మనిషికి పూర్తిగా కావల్సినంత నిద్ర ఉండట్లేదని చెప్పారు. ఈ పరిశోధన ఇండియన్ జర్నల్ ఆఫ్ ఆక్యుపేషనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ మెడిసిన్ పత్రికలో ప్రచురితమైంది. నిద్రపోయేందుకు మంచం ఎక్కిన తర్వాత కూడా సగటున కనీసం నాలుగు సార్లు తమ ఫోన్ లేదా ట్యాబ్‌లను చూసుకుంటున్నారట. ఇలా సరిగ్గా నిద్ర లేకపోతే మెదడు బాగా అలిసిపోతుందని, అది ఏమాత్రం మంచిది కాదని అన్నారు. మరి దీనికి మందేంటి? నిద్రపోయే ముందు తప్పనిసరిగా ఫోన్లు స్విచాఫ్ చేసుకోవాలని, లేదా కనీసం వై-ఫై / మొబైల్ డేటా అయినా ఆఫ్ చేయాలని, ఇంకా కుదిరితే సైలెంట్ మోడ్‌లో పెట్టుకుని పడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరీ అత్యవసరం అయితే ఎటూ ఫోన్ చేస్తారు కాబట్టి, వైబ్రేషన్ వచ్చినా కూడా లేవచ్చని.. అంతేతప్ప నోటిఫికేషన్లు వచ్చినప్పుడల్లా ఫోన్ వైపే చూసుకుంటూ ఉంటే ఇక అసలు నిద్ర సరిగా ఉండదని చెప్పారు. దానివల్ల ఆందోళన దగ్గర నుంచి గుండె వ్యాధుల లాంటి రకరకాల సమస్యలు వస్తాయన్నారు. ఎంత మంది.. ఏం చేస్తున్నారు? 58.5% మంది నిద్ర సమయంలో కూడా వాట్సప్ వాడుతున్నారని, ఆ తర్వాత 32.6% మంది ఫేస్బుక్ వాడుతున్నారని, ఇలాంటి మెసెంజర్ అప్లికేషన్లు కాక జీమెయిల్ లాంటి వాటిని 45.3% మందే వాడుతున్నారని అన్నారు. ఇంట్లో డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ ఉన్నా, వాటితో పాటు మొబైల్ కూడా ఇంటర్నెట్ కోసం వాడుతున్నవాళ్లు 60 శాతం మంది ఉన్నారట. ఇంటర్నెట్ చూసేందుకు కొన్ని పనులను వాయిదా వేస్తామని 42 శాతం మంది చెప్పారు.