న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రబలుతున్న క్యాన్సర్ వ్యాధిని మెరుగైన జీవన శైలితోనే నిరోధించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తరచూ రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహారం తీసుకుంటే వాటిలోని కెమికల్స్ మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని హరించడంతో పాటు పునరుత్పత్తి సామర్ధ్యాన్ని దెబ్బతీస్తాయని, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పూ పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫాస్ట్‌ఫుడ్, పాప్‌కార్న్‌ను ఎక్కువగా తీసుకునేవారిలో అనారోగ్య కారక రసాయనాలు పేరుకుపోయాయని, చక్కగా ఇంటిలో తయారుచేసే ఆహారం తీసుకునేవారిలో కెమికల్స్ తక్కువగా ఉన్నాయని తాజా సర్వే వెల్లడించింది.
రెస్టారెంట్లు, హోటళ్లలో మనం తినే ఆహార పదార్ధాల్లో అత్యధిక పదార్ధాల్లో ట్యాక్సిన్స్ అధికంగా ఉంటాయని, మనం ఏం తింటున్నాము అనే దానితో పాటు ఎక్కడ తింటున్నామనేది కూడా ప్రధానమైనదని ఈ అథ్యయనం చేపట్టిన సైలెంట్ స్ర్పింగ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు పేర్కొన్నారు. ప్యాకేజింగ్ ఫుడ్‌లో అధికంగా ఈ తరహా కెమికల్స్ ఉంటాయని వారు తెలిపారు. ఇంటి వంటతో ప్రమాదకర రసాయనాలు మన శరీరంలో పేరుకుపోకుండా కొన్ని రకాల క్యాన్సర్లు, థైరాయిడ్ సమస్యలు ఉత్పన్నం కాకుండా నియంత్రించవచ్చని పరిశోధకులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment