లండన్ : పక్షవాత బాధితులకు ఊరటగా మెరుగైన చికిత్సా పద్ధతులను శాస్త్రవేత్తలు ఆవిష్కరించే క్రమంలో జన్యు చికిత్స వేలాది బాధితులకు వరంగా మారనుంది. జీన్ థెరఫీ ద్వారా పక్షవాత రోగులు చచ్చుబడిపోయిన కాళ్లు, చేతులు, భుజాలపై తిరిగి నియంత్రణ సాధించేలా చేయవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పక్షవాతానికి గురైన ఎలుకలపై పరిశోధకులు చేపట్టిన అథ్యయనం సానుకూల ఫలితాలను ఇవ్వడంతో జన్యు చికిత్స ద్వారా అద్భుతాలు ఆవిష్కరించవచ్చని అంచనా వేస్తున్నారు.
లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌కు చెందిన న్యూరోసర్జన్ల బృందం చేపట్టిన ఈ అథ్యయనంలో పక్షవాత చికిత్సలో మేలి మలుపు వంటి అంశాలను గుర్తించారు. ఇక వెన్నుపూస గాయాలతో రోజువారీ పనులు చేసుకునేందుకు ఇబ్బందిపడే వారికి ఆయా అవయవాల్లో తిరిగి కదలిక రావడం అసాధ్యమవుతున్న క్రమంలో తాజా అథ్యయన వివరాలు చికిత్సా పద్ధతులను కొత్తపుంతలు తొక్కిస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు.
పక్షవాతం, వెన్నుపూస గాయాలతో ఇబ్బంది పడే వారికి సరికొత్త చికిత్సా పద్ధతుల ద్వారా మెరుగైన జీవితాన్ని అందించేలా తమ అథ్యయన ఫలితాలు వెల్లడయ్యాయని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఎలిజమెత్ బ్రాడ్‌బురీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment