లండన్ : పీచు (ఫైబర్) అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. దీర్ఘకాల ఒత్తిడి మనిషి ప్రవర్తనను మార్చడంతో పాటు శరీరాలను ముఖ్యంగా జీర్ణాశయ వ్యవస్థ, మెదడును దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.శారీరక, మానసిక ఆరోగ్యానికి పెను సవాల్‌గా మారిన ఒత్తిడిని చిత్తు చేసేందుకు ఫైబర్ అధికంగా ఉండే చిరుధాన్యాలు, పండ్లు అధికంగా తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారం జీర్ణాశయ వ్యవస్థతో పాటు మెదడును ఉత్తేజపరుస్తుందని ఐర్లాండ్‌కు చెందిన యూనివర్సిటీ కాలేజ్ కార్క్ పరిశోధకులు చేపట్టిన తాజా అథ్యయనం వెల్లడించింది. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఒత్తిడి, యాంగ్జైటీ స్థాయిలు తగ్గుముఖం పట్టినట్టు జర్నల్ ఆఫ్ ఫిజియాలజీలో ప్రచురితైమన ఈ అథ్యయనం పేర్కొంది.
దీర్ఘకాల ఒత్తిడితో జీర్ణాశయ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని, ఫలితంగా జీర్ణం కాని ఆహారపదార్ధాలు, బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు నేరుగా రక్తంలో కలిసి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ (వాపు) కలిగిస్తాయని అథ్యయనం స్పష్టం చేసింది. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా దీనికి చెక్‌పెట్టవచ్చని అథ్యయనం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment