
న్యూయార్క్ : కరోనా మహమ్మారి మానవ శరీరంలో ఊపిరితిత్తులు, గొంతు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, పేగులు సహా అన్ని కీలక అవయవాలను ఇన్ఫెక్షన్‌కు గురిచేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఊపిరితిత్తులే కాకుండా అన్ని అవయవాలపై వైరస్ దాడి చేస్తుందని దీంతో కోవిడ్-19 లక్షణాలు సైతం బహుముఖంగా ఉంటాయని రెండు వేర్వేరు నివేదికలు వెల్లడించాయి. కరోనా రోగుల్లో లక్షణాలపై ఈ అథ్యయన వివరాలు స్పష్టతను తీసుకువచ్చాయి. మహమ్మారి దాడితో యువతలో స్ట్రోక్‌కు దారితీసేలా బ్లడ్ క్లాట్స్ ఏర్పడం, విపరీతమైన తలనొప్పి, కిడ్నీ వైఫల్యం వంటి తీవ్ర లక్షణాలు కపిపిస్తాయని వెల్లడించింది.
శ్వాసకోశ వైరస్‌గా పేరొందిన కోవిడ్-19 రోగి నోటి నుంచి వెలువడే తుంపరల ద్వారా ఇతరులకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కొన్ని సార్లు డయేరియాకు దారితీయడంతో పాటు పేగు, జీర్ణవ్యవస్థలో ఇబ్బందుల వంటి ఇతర లక్షణాలతోనూ కూడి ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. రోగుల మలంలోనూ వైరస్ జాడను శాస్త్రవేత్తలు గుర్తించారు. సార్స్-కోవిడ్-2 వాహకంగా జీర్ణవ్యవస్థ మారవచ్చని నేచర్ మెడిసిన్‌లో ప్రచురితమైన జీఝూ, యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ పరిశోధకులు చేపట్టిన అథ్యయనం పేర్కొంది. ఇక మానవ శరీరంలోని కీలక అవయవాలన్నింటిలో వైరస్ ఆనవాళ్లను గుర్తించామని న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన మరో అథ్యయనం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment