లండన్ : వారం రోజుల పాటు నైన్ టూ ఫైవ్ జాబ్‌లతో కుస్తీపట్టే ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు తప్పవని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఒకే చోటు కూర్చుని ఏకబిగిన ఇన్నేసి గంటలు పనిచేస్తే అధిక రక్తపోటు సహా పలు వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. 3500 మంది కార్యాలయ ఉద్యోగుల ఆరోగ్యాన్ని విశ్లేషించిన మీదట కెనడాలోని లావల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వివరాలు వెల్లడించారు. వారానికి 40 గంటలు పైబడి పనిచేసే ఉద్యోగుల్లో అంతకంటే తక్కువ పనిగంటలు పనిచేసే వారితో పోలిస్తే అధిక రక్తపోటుకు గురయ్యే ముప్పు మూడింట రెండు వంతులు అధికమని వెల్లడైంది.
వారానికి 40 గంటలు పనిచేసే వారిలో హైపర్‌టెన్షన్‌కు లోనయ్యే అవకాశం 50 శాతంగా నమోదైంది. ఇక వారానికి 35 గంటలే పనిచేసేవారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం తక్కువగా ఉంది. ఇక వారానికి 49 గంటలకు పైగా పనిచేసే వారిలో ఈ రిస్క్ ఏకంగా 70 శాతంగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. పని ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం, వ్యాయామం కొరవడటం ఈ పరిస్ధితికి దారితీస్తోందని అథ్యయనం తెలిపింది. అధిక రక్తపోటు స్ర్టోక్, గుండె పోటు, కిడ్నీ వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. ఐదేళ్ల పాటు సాగిన ఈ అథ్యయనంలో మూడు ఇన్సూరెన్స్ కంపెనీల ఉద్యోగులను పరీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment