ప్రతీకాత్మకచిత్రం
లండన్ : విషవాయువులతో శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయని పలు అథ్యయనాలు వెల్లడవగా, వాయు కాలుష్యం తీవ్ర కిడ్నీ వ్యాధులకు దారితీస్తుందని తాజా అథ్యయనం పేర్కొంది. కిడ్నీ పనితీరుపై గాలిలోని హానికారక పదార్ధాలు ప్రతికూల ప్రభావం చూపుతాయని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ చేపట్టిన అథ్యయనం వెల్లడించింది.
పొగతాగడం తరహాలోనే హానికారక పదార్ధాలు కలిగిన వాయు కాలుష్యం ద్వారా నేరుగా మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని అధ్యయన రచయిత జెన్నిఫర్ బ్రాగీషమ్ స్పష్టం చేశారు. కిడ్నీల నుంచి పెద్ద మొత్తంలో రక్తం ప్రవహిస్తుందని, ఈ ప్రక్రియలో ప్రవాహ వ్యవస్థకు చిన్నపాటి విఘాతం కలిగినా తొలుత కిడ్నీలపై ప్రభావం పడుతుందని చెప్పారు.
కాలుష్య ప్రాంతాల్లో నివసించే మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి హైరిస్క్ రోగులు కాలుష్యం బారిన పడకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. స్వచ్ఛమైన గాలి వీచే ప్రాంతాలతో పోలిస్తే కాలుష్య ప్రాంతాల్లో మూత్రపిండాల వ్యాధులు సహజంగానే అధికమని అథ్యయనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment