లండన్ : హృద్రోగాలకు అత్యాధునిక పద్ధతుల్లో చికిత్సలు అందుబాటులోకి వస్తున్న క్రమంలో 2028 నాటికి గుండె మార్పిడి స్ధానంలో రోబోటిక్ హార్ట్‌ను అమర్చే ప్రక్రియ ఊపందుకోనుంది. ఈ దిశగా నెదర్లాండ్స్, కేంబ్రిడ్జి, లండన్‌లకు చెందిన వైద్య నిపుణులు సాఫ్ట్ రోబోట్ హార్ట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. మూడేళ్లలోగా జంతువుల్లో తొలి నమూనాగా దీన్ని ఇంప్లాంట్ చేసే లక్ష్యంతో వారు పరిశోధనలు ముమ్మరం చేశారు. గుండె జబ్బుల చికిత్సను కొత్తపుంతలు తొక్కించే ఆవిష్కరణలకు ఇచ్చే 30 మిలియన్ యూరోలు చెల్లించే ప్రైజ్‌కు ఎంపికైన నాలుగు ప్రాజెక్టుల్లో రోబోటిక్ హార్ట్ ఒకటిగా ఎన్నికైంది.
రోటోటిక్ హార్ట్‌తో పాటు గుండె జబ్బుకు వ్యాక్సిన్ రూపకల్పన, గుండె లోపాలను సరిచేసే జన్యు చికిత్స, గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, స్ర్టోక్స్‌ను ముందే పసిగట్టే వేరబుల్ టెక్నాలజీలు ఈ ప్రతిష్టాత్మక బహుమతికి ఎంపికయ్యాయి. ఈ బహుమతిని స్పాన్సర్ చేస్తున్న బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్‌కు40 దేశాల నుంచి 75 దరఖాస్తులు అందాయి. ఇక పరిశోధకులు అభివృద్ధి చేస్తున్న రోబోటిక్ గుండె శరీరమంతటికీ రక్తాన్ని పంప్ చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది. మానవులకు ఈ గుండెను అమర్చే ప్రక్రియ మరో ఎనిమిదేళ్లలో అంటే 2028 నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పరిశోధకులు శ్రమిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment