![Research Suggestes Exposure To The Blue Light Emitted From Phones Accelerates Ageing - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/18/light.jpg.webp?itok=IoPYm1tM)
లండన్ : నిత్యం స్మార్ట్‌ఫోన్‌ను విడిచిపెట్టకుండా ఉంటే పెనుముప్పు తప్పదని తాజా అథ్యయనం బాంబు పేల్చింది. ఫోన్లు, కంప్యూటర్ల తెరల నుంచి వెలువడే బ్లూ లైట్‌కు ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే వయసు మీరిన లక్షణాలు ముందుగానే ముంచుకొస్తాయని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. ఎల్‌ఈడీ తరంగాలకు అధికంగా గురైతే మెదడు కణాజాలం దెబ్బతిన్నట్టు ఒరెగాన్ యూనివర్సిటీ తుమ్మెదలపై నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. బ్లూ లైట్ నేరుగా మీ కళ్లలోకి పడనప్పటికీ దానికి ఎక్స్‌పోజ్ అయినంతనే వయసు మీరే ప్రక్రియను వేగవంతం చేస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. కృత్రిమ వెలుగు తుమ్మెదల జీవనకాలాన్ని గణనీయంగా తగ్గించినట్టు కనుగొన్నామని ప్రొఫెసర్ జాగ జిబెల్టవిజ్ తెలిపారు.
మానవ కణజాలంతో పోలిఉన్నందునే ఈ కీటక జాతులపై ఎల్‌ఈడీ తరంగాల ప్రభావాన్ని పరిశీలించామని చెప్పారు. ఆరోగ్యకర మానవులకు, జంతుజాలానికి సహజ కాంతి కీలకమని, అది జీవ గడియారాన్ని ప్రభావితం చేస్తూ మెదడు చురుకుదనం, హార్మోన్ ఉత్పత్తి, కణజాల పునరుద్ధరణను చక్కగా క్రమబద్ధీకరిస్తుందని అథ్యయన రచయితలు పేర్కొన్నారు. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పూర్తిగా వదిలివేయడం సాధ్యం కాని పక్షంలో బ్లూ లైట్ ప్రభావాన్ని తగ్గించడం, రెటీనాను కాపాడుకోవడం కోసం సరైన లెన్స్‌లతో కూడిన గ్లాస్‌లు ధరించాలని సూచించారు. బ్లూ ఎమిషన్స్‌ను నిరోధించే స్మార్ట్‌ఫోన్లు ఇతర ఎలక్ర్టానిక్ పరికరాలను వాడాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment