అతి ఎప్పుడూ నష్టమే.. అవసరానికి వాడుకోవాల్సిన వస్తువుని కాలక్షేపానికి వాడుకోవడం మొదలెడితే వ్యసనం కాక మరేమవుతుంది..! అదే జరుగుతోందిప్పుడు. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ముగ్గురిలోనూ ఇద్దరు దానికి బానిసలైపోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ అలవాటు వారి భౌతిక, మానసిక ఆరోగ్యాలను దెబ్బతీస్తోందనీ, పరిస్థితి చాలా తీవ్రంగా ఉందనీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఫోన్, ట్యాబ్‌లాంటి తెరల వాడకాన్ని సాధ్యమైనంతగా తగ్గించుకోవాలంటున్నారు.
అన్నం తినేటప్పుడు, చదువుకునేటప్పుడు, ఆఖరికి పడుకున్నా చేతిలో ఫోను ఉండాల్సిందే. రోడ్డు మీద నడుస్తున్నా, కారు నడుపుతున్నా మరోపక్క ఫోనూ పనిచేయాల్సిందే. సవ్యసాచిలా రెండు పనులూ ఒకేసారి చేస్తున్నామనుకుంటున్నారు కానీ జరుగుతున్న నష్టాన్ని గుర్తించడం లేదు.
తాజాగా రోడ్లపై ఫోన్ వినియోగిస్తున్నవారిని ‘జాంబీ’లుగా అభివర్ణిస్తూ బెంగళూరు పోలీసులు ఏకంగా హోర్డింగ్‌లు తయారుచేయించారు. ‘స్మార్ట్‌పోన్ జాంబీలున్నాయి జాగ్రత్త’ అని ఓ సైన్‌బోర్డ్‌లో రాశారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
This signboard in BLR singlehandedly attacked our entire generation pic.twitter.com/iN2OsuGBE5
— Prakriti (@prakritea17) January 19, 2024
ఈ స్పష్టమైన హెచ్చరికతో ఉన్న సైన్‌బోర్డ్ డిజిటల్ డిస్ట్రాక్షన్ ప్రభావం ప్రజలపై ఏమేరకు ప్రభావం చూపుతుందో తెలియజేస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ‘ఫోన్‌లు డౌన్, హెడ్స్ అప్..' అని కామెంట్ చేశారు.
ఇదీ చదవండి: ఇదేం ‘సేల్’ బాబోయ్.. అంతా మోసం! ఐఫోన్15 ఆర్డర్ చేస్తే..
కొన్ని సర్వేల ప్రకారం..
- వయసుతో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోను వాడుతున్న సగటు భారతీయుడు రోజుకు 70 సార్లు ఫోను తీసి చూస్తున్నాడట. అంటే గంటకు మూడుసార్లు. తీసిన ప్రతిసారీ మూడు నిమిషాలు చూసినా రోజుకి మూడున్నర గంటలపైనే.
- ఆన్‌లైన్‌లో అపరిచితులతో ప్రైవేటు సంభాషణలు జరిపినట్లు వెల్లడించిన భారతీయ చిన్నారులు ప్రపంచ సగటు కన్నా 11 శాతం ఎక్కువ.
- పదిహేనేళ్లలోపు పిల్లల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం ప్రపంచ సరాసరి 76 శాతం కాగా, మనదేశంలో 83.
- సైబర్ బెదిరింపులూ దుర్భాషలపై తల్లిదండ్రుల ఆందోళన ప్రపంచ సగటు 57 శాతం కాగా భారత సగటు 47. ఇంత తీవ్రమైన అంశాల్నీ పట్టించుకోని నిర్లక్ష్యం ఏ పరిణామాలకు దారితీస్తుందోనని చాలామంది ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment