లండన్ : అతిగా తాగితే అనర్థమేనని పలు అథ్యయనాలు స్పష్టం చేయగా తాజా అథ్యయనం మద్యాన్ని మితిమీరి సేవిస్తే ముంచుకొచ్చే ముప్పును వివరించింది. విపరీతంగా మద్యం తీసుకుంటే శరీరంలో ఐరన్‌ను నియంత్రించే సామర్థ్యం దెబ్బతిని కీలక అవయవాలపై ఒత్తిడి పెరిగి మరణించే ముప్పును పెంచుతుందని అథ్యయనం హెచ్చరించింది. 877 మందిపై అంగ్లియ రస్కిన్ యూనివర్సిటీ చేపట్టిన అథ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
మద్యం తీసుకోని వారితో పోలిస్తే మద్యం అధికంగా సేవించే వారి శరీరంలో ఐరన్‌ను నియంత్రించే శక్తి తక్కువగా ఉన్నట్టు తేలింది. ఇది గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు, మధుమేహం వంటి వ్యాధులకు దారితీస్తుందని పరిశోధకులు చెప్పారు.
ఐరన్ సంగ్రహించే క్రమంలో ఎదురయ్యే ఒత్తిడి ఆక్సిడైజేషన్ ద్వారా కార్డియోవాస్కులర్ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని, ఫలితంగా కణాలు, ప్రొటీన్లు, డీఎన్‌ఏ దెబ్బతినే ముప్పు నెలకొందని అథ్యయన రచయిత డాక్టర్ రుడోల్ఫ్ స్కట్ చెప్పారు. అథ్యయన ఫలితాలు క్లినికల్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment