బేకింగ్ సోడాతో హోమ్ మేకింగ్
కిచెన్ కిటుకు
కేక్‌లు, కుకీస్ వంటివి గుల్లగా రావడం కోసం వాటి తయారీలో బేకింగ్ సోడాని వాడుతుంటాం మనం. కానీ అది వంట చేయడానికే కాదు... చాలా వాటికి పనికొస్తుంది. చాలా పనులు చేసిపెడుతుంది. అవేంటంటే...{ఫిజ్ కనుక దుర్వాసన వస్తుంటే, ఓ చిన్న గిన్నెలో బేకింగ్ సోడా వేసి లోపల ఉంచితే చాలు. ఆ వాసన పోతుంది;ఆభరణాలు కిలుం పట్టినట్టుగా తయారైతే... బేకింగ్ సోడాలో కొంచెం నీళ్లు కలిపి పేస్టులా చేసి, దానితో కడిగితే తిరిగి మెరుస్తాయి;
మన దంతాలు రంగు మారినప్పుడు బేకింగ్ సోడాలో ఉప్పు కలిపి తోముకుంటే మళ్లీ తెల్లగా అయిపోతాయి;నేలమీద పడిన నూనె జిడ్డు వదలకుండా ఉంటే కాసింత బేకింగ్ సోడా చల్లి కడిగితే జిడ్డు పోతుంది.అలాగే వంటగిన్నెల జిడ్డును కూడా బేకింగ్ సోడాతో కడిగి పోగొట్టవచ్చు;డస్ట్‌బిన్ వాసన వస్తుంటే అందులో కాస్త బేకింగ్‌సోడా చల్లితే సరి; స్నాక్స్ దుర్వాసన గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ వాసన వదిలించడానికి నీటిలో బేకింగ్ సోడా వేసి నానబెట్టి ఉతికితే ఫలితముంటుంది;లంచ్ బాక్సులు వాసన వస్తుంటే వాటిని నీటితో నింపి, అందులో కాస్త బేకింగ్ సోడా వేసి నాననిచ్చి, గంట తర్వాత కడిగేస్తే వాసన మాయమౌతుంది;పిల్లలు గోడమీద గీసిన పెన్నుగీతలు పోవాలంటే తడి స్పాంజికి బేకింగ్‌సోడా అద్ది తుడవాలి.