ఇంటిప్స్
కోడిగుడ్డు సొనను గిన్నెలో వేసినప్పుడు ఒక్కోసారి పచ్చసొన గిన్నెకు అంటుకుపోతుంది. అలా జరక్కుండా ఉండాలంటే ముందు గిన్నెను తడిపి, అప్పుడు సొన వేయాలి.వాష్‌బేసిన్లు మురికిగా అయిపోతే... టీ పొడిలో కొంచెం బేకింగ్ సోడా కలిపి రుద్ది కడిగితే మళ్లీ మెరుస్తాయి.పప్పు ఉడికించేటప్పుడు పసుపు రంగు నురగ తేలుతూ ఉంటుంది.
అలా కాకుండా ఉండాలంటే ఉడికించే నీటిలో చెంచాడు నూనె వేయాలి. ఏదైనా వంటకం మాడిపోయినప్పుడు ఆ వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. అది పోవాలంటే... నీటిలో కమలాఫలం తొక్కలు, కొన్ని లవంగాలు వేసి బాగా మరిగిస్తే సరి.