Chicken egg
-
కోడిగుడ్లలో మానవ ప్రోటీన్లు
రోజూ కోడిగుడ్డు తింటే ఆరోగ్యానికి మేలని చెబుతూంటారు. ఇందులో నిజం లేకపోలేదుగానీ.. త్వరలోనే కోడిగుడ్లతో మనిషికి ఇంకో ప్రయోజనమూ చేకూరనుంది. ఎడిన్బరో యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని కొన్ని రకాల వ్యాధులకు అవసరమైన మందులను కూడా ప్రొటీన్ల రూపంలో కోడి గుడ్ల నుంచి సేకరించవచ్చు. మానవ ప్రొటీన్లను మందులుగా చాలాకాలంగా వాడుతున్నా వాటిని కృత్రిమంగా ఉత్పత్తి చేయడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. రకరకాలుగా ముడుతలు పడి ఉండే ప్రొటీన్లను చౌకగా తయారు చేయగలిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎడిన్బరో శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి చేసిన కోళ్ల ద్వారా మానవ ప్రొటీన్లు ఉన్న కోడిగుడ్లను ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు ప్రారంభించారు. వీటిద్వారా ప్రొటీన్ల పనితీరుపై పరిశోధనలు చేయాలన్నది లక్ష్యం. అయితే కోడిగుడ్లలోకి చేరిన మానవ ప్రొటీన్లు అచ్చం మనిషిలోని ప్రొటీన్ల పనితీరును కనబరుస్తూండటంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఉత్పత్తి చేసిన రెండు ప్రొటీన్లు యాంటీవైరల్, యాంటీ కేన్సర్ లక్షణాలు ఉన్న నేపథ్యంలో వాటిపై విస్తృత పరిశోధనలు చేపట్టాలని నిర్ణయించారు. సులువైన పద్ధతి ద్వారా ఈ ప్రొటీన్లను వేరుచేసి వాడుకోవచ్చునని కోళ్లను ఉపయోగిస్తూండటం వల్ల ఖర్చు కూడా చాలా తక్కువని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త హెలెన్ సాంగ్ తెలిపారు. ప్రస్తుతానికి ఈ ప్రొటీన్లను మనుషుల్లో వాడే పరిస్థితి లేదని కాకపోతే సమీప భవిష్యత్తులోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వివరించారు. -
బట్టలు సువాసన రావాలంటే..
ఇంటిప్స్ ఆమ్లెట్ బాగా పొంగాలంటే... కోడిగుడ్డు సొనలో చిటికెడు పంచదార కానీ, కాసింత మొక్కజొన్న పిండి కానీ కలపాలి.ఇస్త్రీ చేసేటప్పుడు ఇస్త్రీపెట్టెలో వేసే నీళ్లలో కాసింత పర్ఫ్యూమ్ వేస్తే బట్టలు మంచి సువాన వస్తాయి. కోడిగుడ్లు ఉడికించే గిన్నె నల్లబడిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే... ఉడికించేటప్పుడు నీటిలో కొద్దిగా చింతపండు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే దానిలో కొద్దిగా పసుపు కలిపి డబ్బాలో దాచిపెట్టాలి. మాంసం కాస్త ముదురుగా అనిపిస్తే... ఉడికించేటప్పుడు చిన్న బొప్పాయి ముక్క వేస్తే త్వరగా ఉడుకుతుంది. బియ్యం కడిగిన నీళ్లలో కాకరకాయ ముక్కలను కాసేపు నానబెట్టి తీసి, ఆ తర్వాత వండితే చేదు ఉండదు. -
ఆ మాటేదో ఈ అమ్మాయికి చెప్పండి..
సరిగ్గా కొత్త ఐదు రూపాలయల బిళ్లంత కూడా లేని కోడిగుడ్డు ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. అవును. 1.55 మిల్లీమీటర్ల వ్యాసంతో 'వరల్డ్స్ స్మాలెస్ట్ చికెన్ ఎగ్'గా ఖ్యాతిపొందుతున్న ఈ గుడ్డును యూకేలోని యురీ సెయింట్ ఎడ్మండ్స్ ప్రాంతంలోని ఓ కోడిపెట్ట పెట్టింది. ఆ కోడి ఓనర్ జార్జియా క్రోచ్ మన్. ఆ యువతి ఇంట్లో 20 కోళ్లను పెంచుకుంటోంది. అవి రోజుకు కొన్ని గుడ్లు పెడతాయి. శుక్రవారం కూడా యథావిథిగా గుడ్లు ఏరుతున్న ఆమెకు ఈ అతిచిన్న గుడ్డు కనిపించడంతో మొదట ఆశ్చర్యానికి గురై, తర్వాత మీడియాకు కబురుపెట్టింది. అన్నీ పరిశీలించిన పిదప ప్రపంచంలో అతిచిన్న కోడుగుడ్డు ఇదేనంటూ రికార్డుల వాళ్లు కితాబిచ్చారు. గతంలో ఈ రికార్డు 1.8 సెంటీమీటర్ల కోడిగుడ్డు పేరిట ఉండేది. రికార్డు సంగతి పక్కన పెడితే ఇంత చిన్న గుడ్డుతో ఏం వండుకోవాలా? అని మథనపడుతోందట జార్జియా! మీదగ్గర ఏదైనా ఐడియా ఉంటే ఆ మాటేదో ఆమెకు చెప్పండి.. -
ఇంటిప్స్
కోడిగుడ్డు సొనను గిన్నెలో వేసినప్పుడు ఒక్కోసారి పచ్చసొన గిన్నెకు అంటుకుపోతుంది. అలా జరక్కుండా ఉండాలంటే ముందు గిన్నెను తడిపి, అప్పుడు సొన వేయాలి.వాష్బేసిన్లు మురికిగా అయిపోతే... టీ పొడిలో కొంచెం బేకింగ్ సోడా కలిపి రుద్ది కడిగితే మళ్లీ మెరుస్తాయి.పప్పు ఉడికించేటప్పుడు పసుపు రంగు నురగ తేలుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఉడికించే నీటిలో చెంచాడు నూనె వేయాలి. ఏదైనా వంటకం మాడిపోయినప్పుడు ఆ వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. అది పోవాలంటే... నీటిలో కమలాఫలం తొక్కలు, కొన్ని లవంగాలు వేసి బాగా మరిగిస్తే సరి.