ఆ మాటేదో ఈ అమ్మాయికి చెప్పండి.. | this is the world's smallest chicken egg | Sakshi
Sakshi News home page

ఆ మాటేదో ఈ అమ్మాయికి చెప్పండి..

Published Tue, Jun 7 2016 12:24 PM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM

ఆ మాటేదో ఈ అమ్మాయికి చెప్పండి..

ఆ మాటేదో ఈ అమ్మాయికి చెప్పండి..

సరిగ్గా కొత్త ఐదు రూపాలయల బిళ్లంత కూడా లేని కోడిగుడ్డు ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. అవును. 1.55 మిల్లీమీటర్ల వ్యాసంతో 'వరల్డ్స్ స్మాలెస్ట్ చికెన్ ఎగ్'గా ఖ్యాతిపొందుతున్న ఈ గుడ్డును యూకేలోని యురీ సెయింట్ ఎడ్మండ్స్ ప్రాంతంలోని ఓ కోడిపెట్ట పెట్టింది.

ఆ కోడి ఓనర్ జార్జియా క్రోచ్ మన్. ఆ యువతి ఇంట్లో 20 కోళ్లను పెంచుకుంటోంది. అవి రోజుకు కొన్ని గుడ్లు పెడతాయి. శుక్రవారం కూడా యథావిథిగా గుడ్లు ఏరుతున్న ఆమెకు ఈ అతిచిన్న గుడ్డు కనిపించడంతో మొదట ఆశ్చర్యానికి గురై, తర్వాత మీడియాకు కబురుపెట్టింది. అన్నీ పరిశీలించిన పిదప ప్రపంచంలో అతిచిన్న కోడుగుడ్డు ఇదేనంటూ రికార్డుల వాళ్లు కితాబిచ్చారు. గతంలో ఈ రికార్డు 1.8 సెంటీమీటర్ల కోడిగుడ్డు పేరిట ఉండేది. రికార్డు సంగతి పక్కన పెడితే ఇంత చిన్న గుడ్డుతో ఏం వండుకోవాలా? అని మథనపడుతోందట జార్జియా! మీదగ్గర ఏదైనా ఐడియా ఉంటే ఆ మాటేదో ఆమెకు చెప్పండి..


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement