పాలకొల్లులో షూటింగ్‌ సందడి | palkollulo shooting sandadi | Sakshi
Sakshi News home page

పాలకొల్లులో షూటింగ్‌ సందడి

Published Fri, May 19 2017 11:05 PM | Last Updated on Mon, Oct 22 2018 8:14 PM

పాలకొల్లులో షూటింగ్‌ సందడి - Sakshi

పాలకొల్లులో షూటింగ్‌ సందడి

ఉల్లంపర్రు (పాలకొల్లు అర్బన్‌): పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో సోడా.. గోలీ సోడా సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఎస్‌బీ ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా శుక్రవారం ఉల్లంపర్రు మాంటిస్సోరీ స్కూల్‌లో పలు సన్నివేశాలను హీరో మానస్‌ (కాయ్‌ రాజా కాయ్‌ ఫేం), హీరోయిన్‌ నిత్యా నరేష్‌ (నందిని నర్శింగ్‌ హోం ఫేం), ఆర్తి (చెన్నై)లపై దర్శకుడు మల్లూరి హరిబాబు తెరకెక్కించారు. కుటుంబ హాస్య కథా చిత్రంగా ఈ మూవీని నిర్మిస్తున్నట్టు దర్శకుడు మల్లూరి హరిబాబు తెలిపారు. ఈ నెల 28  వరకు పాలకొల్లు పరిసర ప్రాంతాలతో పాటు, అమలాపురం, రాజమండ్రి, పాపికొండల్లో సినిమా షూటింగ్‌ జరుగుతుందన్నారు. రెండో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జూన్‌లో చిత్రీకరించి డబ్బింగ్, ఇతర పనులు పూర్తి చేసుకుని జూలై లో విడుదల చేయాలని భావిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు. ప్రముఖ సినీ, మాటల రచయిత తోటపల్లి మధు గ్రామ సర్పంచ్‌గా ఓ వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నారన్నారు. అలాగే హీరో మిత్రులుగా గాదె రాంబాబు, కిర్లంపూడి అచ్చిరాజు, హీరోయిన్‌ ఫ్రెండ్స్‌గా ఆర్తి (చెన్నై), భవాని నటిస్తుండగా మిగిలిన పాత్రల్లో పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, మాధవి, షకలక శంకర్‌ తదితరులు నటిస్తున్నారని వెల్లడించారు. భువనగిరి సత్యసింధూజ, భువనగిరి శ్రీనివాసమూర్తి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement