SS Rajamouli pays emotional tribute to Superstar Krishna on Twitter
Sakshi News home page

Rajamouli Emotional Tweet: సూపర్ స్టార్ కృష్ణ మరణం.. రాజమౌళి ఎమోషనల్ ట్వీట్

Published Tue, Nov 15 2022 5:21 PM | Last Updated on Tue, Nov 15 2022 5:57 PM

Director Rajamouli Emotional Tweet On Superstar Krishna Death - Sakshi

సూపర్ స్టార్ కృష్ణ గారి ఆకస్మిక మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని దర్శకధీరుడు రాజమౌళి విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. 300కు పైగా సినిమాల్లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా చలనచిత్ర రంగానికి సూపర్ స్టార్ చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సినీ పరిశ్రమలో కొత్త టెక్నాలజీ పట్ల ఆయనకు ఉన్న ప్రేమ, అభిరుచి ప్రత్యేకంగా నిలుస్తాయని రాజమౌళి కొనియాడారు. కృష్ణ మృతికి సంతాపం ప్రకటిస్తూ ఆయన ట్వీట్ చేశారు.  

కొత్త టెక్నాలజీని ఉపయోగించడానికి ఆయన చేసిన ధైర్యం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. టాలీవుడ్‌లో మొదటి 70 ఎమ్ఎమ్ చిత్రం, తొలి కలర్ సినిమాతో పాటు ఇతర చిత్రాలతో తెలుగు సినిమాని విప్లవాత్మకంగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందని ప్రశంసించారు. మనం ఎంచుకున్న మార్గంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయొద్దనే విషయాన్ని ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయన్నారు. టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చేసిన కృషికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో మహేష్ బాబు, అతని కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రగాఢ సానుభూతి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement