Mahesh Babu Shared SSMB 28 Poster On Father Krishna Birth Anniversary - Sakshi
Sakshi News home page

SSMB 28: ఇది మీ కోసమే నాన్న.. మహేశ్‌ బాబు ట్వీట్‌, SSMB28 పోస్టర్ వైరల్‌

Published Wed, May 31 2023 10:34 AM

Mahesh Babu Shared SSMB 28 Poster On Father Krishna Birth Anniversary - Sakshi

సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతి  నేడు(మే 31). ఈ సందర్భంగా మహేశ్‌ బాబు, త్రివిక్రమ్‌ కొత్త సినిమా పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. అతడు, ఖలేజా చిత్రాల  తర్వాత త్రివిక్రమ్‌, మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో వస్తున్నహ్యాట్రిక్‌ మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.

(చదవండి: నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నా..హీరో అశ్విన్‌ కన్నీంటి పర్యంతం)

SSMB28 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ పోస్టర్‌ని నేడు విడుదల చేశారు. ఇందులో మహేశ్‌ తలకు ఎర్ర టవల్‌ చుట్టుకొని ఊరమాస్‌ లుక్‌లో కనిపించాడు. ‘ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్ కృష్ణ గారి లెగసీని సెలబ్రేట్ చేసుకుంటూ’అంటూ కార్నర్‌లో కృష్ణగారి ఫోటోని పెట్టారు. పోస్టర్‌ చూస్తుంటే ఫైట్‌ సీన్‌కి సంబంధించినది అని తెలుస్తోంది. ఈ మూవీ టైటిల్‌ని ఈ రోజు సాయంత్రం రివీల్‌ చేయనున్నారు. కాగా, ఈ పోస్టర్‌ని మహేశ్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. ‘ఈరోజు మరింత ప్రత్యేకమైంది. ఇది నీ కోసమే నాన్న’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. మహేశ్‌ చేసిన ట్వీట్, ఆ లుక్ వైరల్ గా మారాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement