
సమ్మర్‌లో నంబర్‌వన్ అవుతుంది!.
‘‘వచ్చింది కదా అవకాశం...ఓ మంచి మాట అనుకుందాం...ఎందుకు ఆలస్యం..అందర్నీ రమ్మందాం’’ అంటూ ‘బ్రహ్మోత్సవం’ టీజర్‌లో మహేశ్‌బాబు చేసిన సందడికి అభిమానులు, ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పీవీపీ సినిమా పతాకంపై పెరల్ వి.పొట్లూరి, పరమ్.వి. పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత ఇందులో కథానాయికలు. ఈ టీజర్ గురించి ‘ సూపర్‌స్టార్ ’ కృష్ణ మాట్లాడుతూ- ‘‘‘బ్రహ్మోత్సవం’ సినిమాలో మహేశ్ తన గత సినిమాల కంటే చాలా బాగున్నాడు. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదలవుతుంది. కచ్చితంగా సమ్మర్ చిత్రాలలో ‘బ్రహ్మోత్సవం’ నంబర్‌వన్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పారు.
భలే మంచి హిట్ ఇది - కృష్ణ
’ ‘‘భలే మంచి రోజు’ సినిమా సుధీర్ కెరీర్‌కు ప్లస్ పాయింట్ అవుతుంది. కచ్చితంగా ఈ సినిమాతో అతని కెరీర్ స్టడీ అవుతుందన్న నమ్మకం ఉంది. అతనికిది భలే మంచి హిట్’’ అని సూపర్ స్టార్ కృష్ణ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో కృష్ణ, విజయనిర్మల ఈ సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా కృష్ణ పాత్రికేయులతో మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఎవరి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేయకుండా ఇంత మెచ్యూర్డ్‌గా, క్లారిటీగా సినిమా తీయడం చాలా విచిత్రంగా ఫీలయ్యాను. శ్రీరామ్‌కి మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అని చె ప్పారు. ‘‘ఈ సినిమాలో సుధీర్ యాక్టింగ్ బాగుంది. శ్రీరామ్ ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద సినిమా తీయడం గొప్ప విషయమే’’ అని విజయనిర్మల అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో సుధీర్‌బాబు, నిర్మాతల్లో ఒకరైన విజయ్, దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.