సూపర్ స్టార్ కృష్ణ... తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ చరిత్రగా నిలిచిన పేరు ఇది. హీరోగా వెండితెరపై కొత్త పాత్రలను పరిచయం చేసిన ఘనత ఆయనది. అందుకే కృష్ణ అంటే నేటి తరానికి కూడా పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. పాత్రలతో ప్రయోగాలు చేస్తూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త ఒరవడికి పుంతలు వేశారు. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ వంటి లెజెండరి నటులు పోటీగా ఉన్నప్పటికీ పాత్రలతో ప్రమోగాలు చేసేందుకు ఏమాత్రం వెనకాడని సాహిసి ఆయన. అలా మోసగాళ్లకు మోసగాడు అనే యాక్షన్ మూవీ చేసి రికార్డు సృష్టించారు.
అప్పటి వరకు హాలీవుడ్‌లో మాత్రమే కనిపించే ఈ పాత్రలు ఈ మూవీతో తొలిసారి ఇండియన్ సినిమాలో అది తెలుగు తెరపై పరిచయం కావడం విశేషం. 1971లో విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. ఒక్క తెలుగులోనే కాదు హిందీ. తమిళం, మలయాళం, బెంగాలీతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లోనూ విడుదలైన ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. ఇక ఈసినిమాతో కౌబాయ్‌గా టాలీవుడ్‌లో చెరగని ముద్ర వేసుకున్నారు ఆయన. కృష్ణ అంటే ఓ స్టార్ హీరో మాత్రమే కాదు గొప్ప వ్యక్తిగతం ఉన్న హీరో కూడా.
ఇక కృష్ణను నిర్మాతల హీరో అని కూడా పిలుస్తుంటారనే విషయం తెలిసిందే. నిర్మాతల హీరోగా మంచి మనసున్న వ్యక్తిగా సూపర్ స్టార్ కృష్ణకు పేరు ఉంది. తాను నటించిన సినిమా ప్లాప్ అయితే వెంటనే ఆ నిర్మాతతను పిలిచి.. మళ్ళీ మంచి కథ సిద్ధం చేసుకోండి… ఫ్రీగా సినిమా చేస్తాను చెప్పడమే కాదు.. వారికిచ్చిన మాటను నిలబెట్టుకున్న హీరో ఆయన. అలా పలు నిర్మాతలకు ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండ నటించి వారికి హిట్‌లు ఇచ్చారు కృష్ణ. ఇదే విషయాన్ని ఎన్నో సందర్భాల్లో అప్పటి నిర్మాతలే స్వయంగా చెప్పారు. కృష్ణ గారు గొప్ప వ్యక్తిత్వం ఉన్న హీరో మాత్రమే కాదని, ఆయన నిర్మాతల హీరో అంటూ ఆయనపై తరచూ ప్రశంసలు కురిపించేవారు.
తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి సూపర్ స్టార్ కృష్ణ సినిమాలే. అంతేకాదు కృష్ణ ఒకానొక సమయంలో రోజుకి మూడు షిప్ట్ ల చొప్పున పని చేస్తూ.. ఏడాదికి 10 సినిమాలను పూర్తి చేశారు. అంటే 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాల్లో నటించారు. అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తి చేశారు. కృష్ణ ఒకే ఏడాది 17 సినిమాలను విడుదల చేసి రికార్డు సృష్టించాడు. 1972లో కృష్ణ హీరోగా నటించిన 17 సినిమాలు విడుదలయ్యాయి. ప్రపంచంలో మరే సినీ నటుడికీ ఇలాంటి రికార్డు లేదు.
చదవండి:
తండ్రి మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమైన మహేశ్
నటులకు ఆ భయం పట్టుకుంది: ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment