Super Star Krishna About Sarkaru Vaari Paata Movie Success - Sakshi
Sakshi News home page

Krishna: పోకిరి కంటే కూడా మహేశ్‌ ఈ సినిమాలో చాలా యంగ్‌గా ఉన్నాడు

Published Wed, May 18 2022 5:38 PM | Last Updated on Wed, May 18 2022 7:14 PM

Super Star Krishna About Sarkaru Vaari Paata Movie Success - Sakshi

Super Star Krishna About Sarkaru Vaari Paata Movie: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోన్న ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించింది. అలాగే రూ. 100.44 కోట్ల షేర్‌ను సాధించి రికార్డు సృష్టించింది. ఇలా ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్‌ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా సర్కారు వారి పాట రికార్డుకెక్కింది. ఇదిలా ఉంటే సర్కారు వారి పాట మూవీపై మహేశ్‌ తండ్రి, సూపర్‌ స్టార్‌ కృష్ణ స్పందించారు.

చదవండి: జై భీమ్‌ వివాదం, హీరో సూర్య, జ్యోతికలపై ఎఫ్‌ఐఆర్‌

సర్కారు వారి పాట సక్సెస్‌ నేపథ్యంలో ఆయన తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా సర్కారు వారి పాట ఇంత ఘనవిజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘మహేశ్‌ సర్కారు వారి పాట చాలా బాగుతుంది. ఫస్ట్‌ హాప్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంది. సెకండ్‌ హాఫ్‌లో మహేశ్‌ పర్ఫామెన్స్‌ అద్భుతంగా ఉంది. ఈ మూవీ కలేక్షన్స్‌ అన్ని సెంటర్స్‌లోనూ హౌజ్‌ఫుల్‌తో పోతుంది. అయితే కొన్ని చానల్స్‌ మాత్రం మూవీ బాగాలేదని ప్రచారం చేస్తున్నారు’ అని అన్నారు. ఈ సినిమాలో మహేశ్‌ పోకిరి కంటే కూడా చాలా యంగ్‌ కనిపిస్తున్నాడంటూ కృష్ణ మురిసిపోయారు. మహేశ్‌ చాలా మెయిన్‌టెన్‌ చేస్తాడని, షూటింగ్‌ లేని రోజుల్లో ఎక్కువ సమయంలో జిమ్‌లోనే ఉంటాడని చెప్పారు.

చదవండి: కంగనా చిత్రాలన్ని ఫ్లాప్‌ అవ్వాలని కోరుకుంటున్నా: నటి పాయల్‌

ఇక సర్కారు వారి పాట సినిమా గురించి సుప్రీం కోర్టులో మాట్లాడాలని, అంత మంచి కథ తీసుకున్నారని చెప్పారు. ఇక మే 31న ఆయన బర్త్‌డే వేడుకలపై స్పందిస్తూ స్ట్రెయిన్‌ అవుతున్న కారణంగా గత 5 ఏళ్లుగా బయటకు వెళ్లడం లేదని, తన చిన్న కూతురు ప్రయదర్శిని ఇంట్లోనే తనకు ఇష్టమైన వంటకాలు అన్ని చేస్తుందని తెలిపారు. అయితే సర్కారు వారి పాట మూవీ ఇంట్లోనే తన హోం థియేటర్లో చూశానని, సినిమా చూడగానే మహేశ్‌కు ఫోన్‌ చేశానన్నారు. చాలా బాగా నటించావని, పోకిరి, దూకుడు కంటే కూడా సర్కారు వారి పాట పెద్ద హిట్‌ అవుతుందని చెప్పడంతో వాడు చాలా హ్యాపీగా ఉన్నాడని పేర్కొన్నారు. అనంతరం భవిష్యత్తులో మహేశ్‌ అల్లూరి సీతారామరాజు సినిమా చేసే అవకాశం ఉందా? అని అడగ్గా వందశాతం ఈ మూవీ చేయబోడని కృష్ణ బదులిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement