Mahesh Babu's SSMB 28 Movie Shoot With Trivikram Srinivas Begins On December - Sakshi
Sakshi News home page

SSMB 28: యాక్షన్‌ ప్లాన్‌.. పుట్టెడు శోకంలోనూ షూటింగ్‌కు మహేశ్‌!

Published Wed, Nov 30 2022 9:46 AM | Last Updated on Wed, Nov 30 2022 10:24 AM

SSMB 28: Mahesh Babu, Trivikram Movie To Go On Floor In December - Sakshi

రెండు నెలల క్రితం తల్లి ఇందిరా దేవి మరణం, ఇటీవల(నవంబర్‌ 15) తండ్రి కృష్ణ హఠాన్మరణంతో మహేశ్‌ బాబు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో సినిమా షూటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన తివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. అతడు’(2005), ‘ఖలేజా’ (2010) చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో సినిమా ఇది.  ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న చిత్రం ఇది.

ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఆ మధ్య హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయ్యింది. అక్కడే ఓ వారం రోజులు షూట్ చేశారు. రెండో షెడ్యూల్‌ ఇటీవల ప్రారంభం కావాల్సి ఉండగా.. కృష్ణ మరణంతో వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ డిసెంబరు 8న ప్రారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో ముందు ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను ప్లాన్‌ చేశారట త్రివిక్రమ్‌.  

తండ్రి మరణంతో మహేశ్‌ పుట్టేడు శోకంలో ఉన్నప్పటికీ.. నిర్మాతల కోసం తిరిగి షూటింగ్‌లో పాల్గొనడంపై సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా  షూటింగ్ పునఃప్రారంభానికి సహకరించడం.. సినిమాపై ఆయనకు ఉన్న శ్రద్ద, గౌరవాన్ని చూపిస్తోందని అభిమానులు తెలుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement