కేసీఆర్‌ గారికి హృదయపూర్వక అభినందనలు | Superstar krishna praises to kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ గారికి హృదయపూర్వక అభినందనలు

Published Thu, Dec 13 2018 12:14 AM | Last Updated on Thu, Dec 13 2018 12:14 AM

Superstar krishna praises to kcr - Sakshi

మొన్న విడుదలైన తెలంగాణ ఎన్నికల ఫలితాలలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు చిత్ర ప్రముఖులతో పాటు ఆయనకు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అభినందనలు తెలియజేసింది. ఈ సందర్భంగా సూపర్‌ స్టార్‌ కృష్ణ మాట్లాడుతూ– ‘నాలుగున్నరేళ్ల పరిపాలన తర్వాత ఇంత అత్యధిక స్థానాలలో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావటం చాలా గొప్ప విషయం. కేసీఆర్‌గారు ప్రవేశ పెట్టిన పథకాలన్నీ ప్రజలకు మేలు చేశాయి. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఆయనకి అఖండ విజయాన్ని అందించారు. మళ్లీ రెండోసారి తెలంగాణకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న శ్రీ కె. చంద్రశేఖరరావుగారికి నా హృదయపూర్వక అభినందనలు’’ అన్నారు.
 
కేసీఆర్‌గారికి ‘మా’ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి విజయ పతాకాన్ని ఎగురవేసిన టీఆర్‌ఎస్‌ నేత కేసీఆర్‌ను మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అభినందించింది. ‘‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చిత్రపరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతో కట్టుబడి ఉంది. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ గారిని, ఎఫ్‌.డి.సి. చైర్మన్‌ రామ్మోహన్‌రావు గారిని ఎప్పుడు ఏ పని నిమిత్తం కలిసినా వారు ఎంతో సహకరించారు. ‘మా’ రజతోత్సవం సందర్భంగా ఓ పెద్ద బాధ్యత మాపై ఉంది. గోల్టెన్‌ హోమ్‌ నిర్మాణాన్ని ఈ కార్యవర్గం ఉండగానే ప్రారంభించాలనుకుంటున్నాం. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాం’’ అన్నారు ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement