
‘‘రియల్ బోల్డ్ కపుల్ అంటే కృష్ణగారు, విజయ నిర్మలగారు. వాళ్ల రథం మళ్లీ ముందుకు వెళ్లాలని విజయ్ కృష్ణ మూవీస్‌ని మళ్లీ ప్రారంభించడం గర్వంగా ఉంది. సూపర్‌స్టార్ కృష్ణగారి 81వ జయంతి (మే 31) సందర్భంగా ‘మళ్ళీ పెళ్లి’ చిత్రాన్ని ఆయనకి అంకితం చేస్తున్నాను’’ అని వీకే నరేష్ అన్నారు.
ఎంఎస్ రాజు దర్శకత్వంలో వీకే నరేష్, పవిత్రా లోకేష్ జంటగా నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. నరేష్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం (26) విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో వీకే నరేష్ మాట్లాడుతూ–‘‘ నేను బతికున్నంత కాలం నటిస్తాను. అలాగే సమాజ సేవ చేస్తా’’ అన్నారు. చిత్రపరిశ్రమలో వీకే నరేష్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సెలబ్రిటీ వరల్డ్ రికార్డ్’ నిర్వాహకులు ఆయన్ను సత్కరించారు. సంగీత దర ్శకుడు సురేష్ బొబ్బిలి, నటి అన్నపూర్ణమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment