Naresh Reacts On Having Children With Pavitra Lokesh - Sakshi
Sakshi News home page

శారీరకంగా పర్ఫెక్ట్‌.. పిల్లలను కనడంపై నరేశ్‌, పవిత్ర బోల్డ్‌ కామెంట్స్‌!

Published Tue, May 30 2023 11:18 AM | Last Updated on Tue, May 30 2023 11:50 AM

Naresh Reacts On Having Children With Pavitra Lokesh - Sakshi

సీనియర్‌ నటుడు నరేశ్‌, పవిత్ర లోకేష్‌ గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. తాము ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో సమాజానికి చెప్పడానికే ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమాను తెరకెక్కించారు. ఎమ్మెస్‌ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలైంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. నరేశ్‌, పవిత్రల రిలేషన్‌షిప్‌ మాత్రం అందరికి తెలిసిపోయింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఈ జంట చేసిన బోల్డ్‌ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అయ్యాయి.

(చదవండి: స్నేహా కాదు.. ఫస్ట్‌ గర్ల్‌ఫ్రెండ్‌ పేరు రివీల్‌ చేసిన అల్లు అర్జున్‌ )

మాములుగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితం గురించి చిన్న బయటకు చెప్పాలన్నా భయపడతారు. కానీ నరేశ్‌, పవిత్రలు మాత్రం ప్రతీది చాలా ఓపెన్‌గా చెప్పేశారు. పెళ్లి విషయమే కాదు... పిల్లలు కనడంపై తమ అభిప్రాయం ఏంటో కూడా చెప్పేశారు. ఇప్పటికీ పవిత్రతో కలిసి పిల్లలు కనడంతో తప్పేమి లేదని నరేశ్‌ అంటున్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నరేశ్‌ మాట్లాడుతూ.. తాను, పవిత్ర శారీరకంగా పర్ఫెక్ట్‌గా ఉన్నామని చెప్పారు. ‘ఇప్పటికీ మేము మెడికల్‌గా పిల్లలను కనొచ్చు. అయితే ఇప్పుడు మేము పిల్లలను కంటే.. నాకు 80 ఏళ్లు వచ్చేసరికి పుట్టే బిడ్డకి 20 ఏళ్లు వస్తాయి. అలా అవసరమా? భార్యభర్తలుగా మేము కలిసి ఉంటాం. పవిత్ర పిల్లలు, నా పిల్లలు.. ఇద్దరూ మా బిడ్డలే అనుకుంటాం. మాకు ఇప్పుడు 5 మంది పిల్లలు ఉన్నారనుకొని బతుకుతున్నాం.

నా దృష్టిలో బ్లడ్‌ రిలేషన్‌షిప్‌ కంటే ఎమోషనల్‌ రిలేషన్‌ షిప్‌ చాలా గొప్పది. కృష్ణ గారిని చూస్తే అమ్మ కనిపించేంది. ఆయన పోయిన తర్వాత కుప్పకూలిపోయాను. మానసికంగా చాలా కృంగిపోయాను. పవిత్రలో మా అమ్మ విజయనిర్మల గారు కనిపించారు. ఆమె కళ్లు, పవిత్ర కళ్లు ఒకేలా ఉంటాయి. మా ఇద్దరి పిల్లలను చూసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడుపుతాం’అని నరేశ్‌ చెప్పుకొచ్చాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement