Actress Pavitra Lokesh Hikes Her Remuneration, Details Here - Sakshi
Sakshi News home page

పవిత్ర లోకేశ్‌ ఒక్క రోజు రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

Published Sat, May 27 2023 10:58 AM | Last Updated on Sat, May 27 2023 11:29 AM

Pavitra Lokesh Remuneration - Sakshi

పవిత్ర లోకేశ్‌ ఇప్పటికే చాలా సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేసింది. కానీ నరేశ్‌తో ప్రేమ వ్యవహారం తర్వాతే ఈమెకు ఇక్కడ బాగా గుర్తింపు వచ్చింది. గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. ఈ విషయాన్ని  నరేశ్‌ బహిరంగంగా ప్రకటించాడు.

ఇక వీరిద్దరు కలిసి నటించిన ‘మళ్ళీ పెళ్లి’ నిన్న(మే 26)విడుదలైన సంగతి తెలిసిందే. వీరిద్దరి నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఎమ్మెస్‌ రాజు. నరేశ్‌ ఈ చిత్రంలో నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడు.ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో నటించనందుకుగాను పవిత్ర భారీ రెమ్యునరేషన్‌ పుచ్చుకుందట. 

(చదవండి: మళ్ళీ పెళ్లి మూవీ రివ్యూ)

వాస్తవానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన పవిత్ర లోకశ్‌ రోజుకు రూ.50 వేలు పారితోషికంగా తీసుకునేదట. అయితే నరేశ్‌ ప్రేమ వ్యవహారంతో పవిత్ర మరింత ఫేమస్‌ అయింది. దీంతో ఆమె తన రెమ్యునరేషన్‌ని కూడా పెంచేసిందట. ప్రస్తుతం రోజుకు లక్ష వరకు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా అంత మొత్తం ఇచ్చేందుకు కూడా నిర్మాతలు వెనకడుగు వేయడం లేదట. ప్రస్తుతం పవిత్రకు వరుస ఆఫర్స్‌ వస్తున్నాయి. తనపై వస్తున్న ట్రోల్స్‌ని పట్టించుకోకుండా వరుస సినిమాలతో బిజీ అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement