
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఇంట వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాదిలోనే తల్లి, సోదరుడిని పోగొట్టుకున్న మహేశ్‌కు తాజాగా తండ్రి కూడా దూరమయ్యాడు. గతకొంత కాలంగా అనారోగ్యంగో బాధపడుతున్న సూపర్‌స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణ మరణంతో విషాదంలో ఘట్టమనేని ఇంట విషాదం నెలకొంది. తండ్రి మరణాన్ని మహేశ్‌బాబు జీర్ణించుకోలేకపోతున్నాడు.
(చదవండి: అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు)
నాన్న అంటే మహేశ్‌కు ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. ‘నాన్న నాకు దేవుడితో సమానం’ అని చాలా సందర్భాల్లో మహేశ్ చెప్పాడు. ఇప్పుడా దేవుడే లేడననే విషయాన్ని మహేశ్ తట్టుకోలేకపోతున్నాడు. తండ్రి పార్థీవదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మహేశ్‌ను అలా చూసి ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు.ధైర్యంగా ఉండాలంటూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా మహేశ్ సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సోదరుడు రమేశ్‌బాబు మరణించిన సమయంలో మహేశ్ ఓ కార్యక్రమంలో పాల్గొని స్టేజ్ పైన ఎమోషనల్ గా మాట్లాడాడు.‘నాకు బాగా కావాల్సిన వాళ్ళు దూరమయ్యారు. ఏది జరిగిన మీ అభిమానం మాత్రం మారలేదు’ అంటూ అభిమానులనుద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment