సాక్షి, హైదరాబాద్: తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిగ్గజం, నటశేఖర సూపర్ స్టార్ కృష్ణకు కడసారి వీడ్కోలు పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చారు. బుధవారం ఉదయం తాడేపల్లి(గుంటూరు) నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన.. పద్మాలయ స్టూడియోకు వెళ్లారు. అక్కడ కృష్ణ పార్థివ దేహానికి ఆయన నివాళులు అర్పించారు.
పద్మాలయ స్టూడియోలో ప్రజల సందర్శన కోసం ఉంచిన కృష్ణ పార్థివ దేహానికి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. అనంతరం.. ఘట్టమనేని కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. కృష్ణ తనయుడు మహేష్ బాబుని హత్తుకుని ఓదార్చారు సీఎం జగన్.
ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నట దిగ్గజానికి నివాళి అర్పించిన వాళ్లలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో పాటు మంత్రి వేణుగోపాలకృష్ణ, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
నటశేఖరుడు, తెలుగు ఇండస్ట్రీ సూపర్ స్టార్ కృష్ణకు నివాళి అర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌కు వచ్చారు.
శ్వాస కోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న కృష్ణ ఆదివారం సాయంత్రం గుండెపోటుకి గురికాగా.. నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఆయన్ని కుటుంబ సభ్యులు చేర్చారు. సోమవారం సాయంత్రం ఆయన పరిస్థితి విషమించగా.. మంగళవారం వేకువ ఝామున నాలుగు గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆయన అభిమాన గణం, యావత్ తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగింది.
ఇదీ చదవండి: సినీ సాహసి.. ఘట్టమనేని కృష్ణ
Comments
Please login to add a commentAdd a comment