
సాక్షి, విజయవాడ: సూపర్‌స్టార్ కృష్ణకు నవరంగ్ థియేటర్ యాజమాన్యం ఘననివాళులు అర్పించింది. విజయవాడలో గల ఈ థియేటర్‌కు కృష్ణ గతంలో అనేకమార్లు వచ్చారు. ఈనేపథ్యంలో సూపర్‌స్టార్ కృష్ణ కోసం థియేటర్ యాజమాన్యం రోజు మొత్తం ఒక సీటు రిజర్వ్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంది.
సూపర్ కృష్ణ మృతికి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు సైతం ఘన నివాళి అర్పించారు. ఆయన అకాల మృతికి సంతాపంగా మంగళవారం(నవంబర్ 15) పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా థియేటర్లో ఉదయం ఆటలను రద్దు చేసినట్లు జిల్లా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తెలిపారు.
ఇదిలాఉంటే, కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కృష్ణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. బుధవారం సాయంత్రం మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈమేరకు సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment