Super Star Krishna Dead Body Stay Night At Nanakramguda House - Sakshi
Sakshi News home page

Superstar Krishna: కృష్ణ నివాసం వద్దే పార్థివదేహం.. రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు

Published Tue, Nov 15 2022 6:59 PM | Last Updated on Tue, Nov 15 2022 8:01 PM

Superstar Krishna Dead Body Stay Night At Nanakram Guda House - Sakshi

సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని ఇవాళ నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసంలోనే ఉంచనున్నారు. అభిమానుల సందర్శనార్థం విజయకృష్ణ నిలయం వద్దే ఈ రాత్రికి పార్థివదేహాన్ని ఉంచునున్నట్లు ప్రకటించారు. సూపర్ స్టార్ అభిమానులు ఆయన నివాసం వద్దకే వచ్చి నివాళులు అర్పించవచ్చని మహేశ్‌ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చేసింది. అయితే రేపు ఉదయం 9 గంటలకు పద్మాలయ స్టూడియోస్‌కు ఆయన పార్థివదేహాన్ని తరలించనున్నారు. 

(చదవండి: సూపర్ స్టార్ కృష్ణ మరణం.. రాజమౌళి ఎమోషనల్ ట్వీట్)

మంగళవారం సూర్యాస్తమయం కావడం వలన పార్థివదేహాన్ని ఆయన నివాసం వద్దే ఉంచుతున్నారు. మొదట సాయంత్ర 5 గంటల తర్వాత గచ్చిబౌలి స్టేడియానికి తరలించాలని భావించారు. కానీ సమయం మించి పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.   బుధవారం మధ్యాహ్నం తర్వాత మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లపై సీఎస్‌ సోమేశ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement