Superstar Krishna Funerals: Mahesh Babu Arranged Food For Krishna Fans - Sakshi
Sakshi News home page

Superstar Krishna Funerals: మహేశ్ బాబు గొప్ప మనసు.. వారు అలా వెళ్లకూడదని..!

Published Wed, Nov 16 2022 6:02 PM | Last Updated on Wed, Nov 16 2022 7:05 PM

Hero Mahesh Babu Arrange Food For Superstar Krishna Fans In Funerals - Sakshi

మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు అభిమానుల అశ్రునాయనాల మధ్య, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఇవాళ ముగిశాయి. అభిమాన జనవాహిని ఆయన వెంట ఒక సైన్యంలా తరలివచ్చింది. తమ అభిమాన నటుడిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి సైతం వేలసంఖ్యలో నగరానికి చేరుకున్నారు. కృష్ణ పార్థివదేహాన్ని కడసారి చూసి భావోద్వేగానికి లోనయ్యారు. 

(చదవండి: అశ్రునయనాల మధ్య ముగిసిన కృష్ణ అంత్యక్రియలు)

ఇలాంటి విషాద సమయంలోనూ మహేశ్ బాబు తన గొప్ప మనసును చాటుకున్నారు. సూపర్‌ కృష్ణ కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. అభిమానులందరికీ ఆయన భోజన ఏర్పాట్లు చేశారు. తన తండ్రిని చూసేందుకు వచ్చిన వారు ఖాళీ కడుపుతో వెళ్లకూడదని మహేశ్‌బాబు అందరికీ భోజనం ఏర్పాటు చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన విషాదంలో ఉన్నా మా ఆకలి తీర్చారంటూ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. కాగా.. మధ్యాహ్నాం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement