సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యలు పేర్కొన్నారు. ఈ మేరకు ఆస్పత్రి చైర్మన్ గురునాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘సుమారు ఆయన మధ్యరాత్రి సమయంలో గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే ఎమర్జేన్సీకి తరలించాం. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందించాం. అరగంట పాటు సీపీఆర్ చేశాం. ప్రస్తుతం ఇంటెన్సీవ్ కేర్‌లో ఉన్నవారికి ఎటువంటి చికిత్స ఇవ్వాలో అదే చేస్తున్నాం.
చదవండి: సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక
ఇప్పటికీ చికిత్స కొనసాగుతూనే ఉంది. మరో 24 గంటల వరకు ఏం చెప్పలేం’ అన్నారు. అనంతరం ఆయన దగ్గరి బంధువులంతా ఆస్పత్రిలో ఉన్నారని, వారి ప్రైవసీని ప్రతి ఒక్కరు గౌరవించాలని ఆయన కోరారు. అంతేకాదు ప్రతి గంట క్రూషియల్ అని, ఆయన కోలుకోవాలని ప్రార్థిద్దాం చైర్మన్ గురునాథ్ రెడ్డి అన్నారు. దీంతో తమ అభిమాన నటులు కృష్ణ కోలుకోవాలని ఘట్టమనేని ఫ్యాన్స్, సినీవర్గాలు ప్రార్థిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment