'బుర్రిపాలెంను దత్తత తీసుకోబోతున్న మహేష్‌బాబు'
గుంటూరు : గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామాన్ని తన బావమరిది, సినీహీరో మహేష్‌బాబు త్వరలో దత్తత తీసుకోనున్నట్టు గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా తెలిపారు. బుర్రిపాలెం జెడ్పీ హైస్కూలు ఆవరణలో సర్వశిక్షా అభియాన్ నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు జయదేవ్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జయదేవ్ మాట్లాడుతూ బుర్రిపాలెంను దత్తత తీసుకుని స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దాలని ఎన్నికలకు ముందే అనుకున్నామని చెప్పారు. కానీ ప్రజా ప్రతినిధులు తమ స్వగ్రామం, ఆత్తగారి ఊర్లను దత్తత తీసుకోకూడదన్న నిబంధనలు ఉండడంతో కుదరలేదన్నారు. అయితే తన భార్య, సూపర్‌స్టార్ కృష్ణ కుమార్తె పద్మ తెనాలి మండలం కంచర్లపాలెంను, తన బావమరిది అతని స్వగ్రామమైన బుర్రిపాలెంను దత్తత తీసుకోనున్నారని జయదేవ్ తెలిపారు.