US Comedian and Full House Star Bob Saget Found Dead - Sakshi
Sakshi News home page

Bob Saget: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ప్రముఖ కమెడియన్‌..

Published Mon, Jan 10 2022 2:03 PM | Last Updated on Mon, Jan 10 2022 2:52 PM

Us Comedian And Full House Star Bob Saget Found Dead At 65 - Sakshi

ప్రముఖ అమెరికన్‌ కమెడియన్‌ బాబ్‌ సాగేట్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఫ్లోరిడాలోని ఓ హోటల్‌ గదిలో సాగేట్‌ శవమై కనిపించడం పలు అనుమానాలకు తావిస్తుంది. మరణానికి కొన్ని గంటల ముందు కూడా ఆయన చేసిన ఓ షో గురించి సరదాగా ట్వీట్‌ చేయడం గమనార్హం.

గత రాత్రి ఓర్లాండోలోని రిట్జ్-కార్ల్‌టన్‌లోని హోటల్‌లో సాయంత్రం 4గంటల తర్వాతి నుంచి సాగేట్‌ గదిలోంచి బయటకు రాకపోవడం, ఎలాంటి స్పందన లేకపోవడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ ఎలాంటి డ్రగ్స్‌ లేవని ద్రువీకరించారు. ప్రస్తుతం సాగేట్‌ మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

అమెరికన్‌ కమెడియన్‌గా భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న బాబ్‌ సాగేట్‌ 1956 మే 17న అమెరికాలోనే జన్మించాడు. 1887 నుండి 1995 వరకు ప్రసారమైన ABC టెలివిజన్ షో ‘ఫుల్ హౌస్‌’లో డానీ టాన్నర్ పాత్రతో పాపులర్‌ అయ్యాడు. దీని సీక్వెల్‌గానే  ‘ఫుల్‌ హౌస్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో ఓ పాపులర్‌ వెబ్‌సిరీస్‌ కూడా తెరకెక్కిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement