పుతిన్‌తో రవిల్ మగనోవ్ (పాత చిత్రం)
మాస్కో/లండన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రష్యాలో గత కొన్ని నెలలుగా హైప్రొఫైల్ ప్రముఖులు అనుమానాస్పద రీతిలో చనిపోతుండడం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. అయితే ఈ మరణాలపై రష్యా మీడియా గప్‌చుప్‌గా ఉంటున్నా.. పాశ్చాత్య మీడియా సంస్థలు మాత్రం పుతిన్ ప్రమేయంతోనే జరుగుతున్న హత్యలంటూ చర్చిస్తున్నాయి.
తాజాగా.. రష్యాలో అతిపెద్ద రెండో చమురు సమస్థ లుకోలి అధినేత రవిల్ మగనోవ్.. అనుమానాస్పద రీతిలో చనిపోయారు. 67 ఏళ్ల రవిల్.. గురువారం మాస్కోలోని ఓ ఆస్పత్రి కిటికీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి మీడియా చెబుతోంది. అయితే..
ఉక్రెయిన్ యుద్ధం త్వరగా ముగియాలని కోరుకుంటున్నట్లు ఆయన అప్పట్లో ఒక ప్రకటన ఇచ్చారు. అంతేకాదు.. ఉక్రెయిన్ విషయంలో రష్యా దారుణంగా వ్యవహరిస్తోందని, వెనక్కి తగ్గాలంటూ పిలుపు ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక పెనువిషాదంగా అభివర్ణించిన ఆయన.. వీలైనంత త్వరలో ముగింపు పడుతుందని ఆశిస్తున్నట్లు వరుసగా ప్రకటనలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో..
ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ పుతిన్ చేయించిన హత్యేనని ఆరోపిస్తున్నారు. ఇక ఆయన భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సరైన ఆధారాలు చూపించలేకపోతున్నారని సన్నిహితులు అనుమానాలు లేవనెత్తుతున్నారు. అంతేకాదు.. ఆయనతో దగ్గరి సంబంధాలు ఉన్న వ్యక్తులు సైతం ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెప్తున్నారు. మే నెలలో లుకోలీ మాజీ మేనేజర్ అలెగ్జాండర్ సుబ్బోటిన్ తన ఇంటి బేస్‌మెంట్‌లో మృతదేహంగా కనిపించారు. రష్యా ఎనర్జీ పరిశ్రమతో సంబంధాలున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సైతం గత కొన్నినెలలుగా అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారు.
1993 నుంచి లుకోలిలో ఆయన పని చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రష్యా దర్యాప్తు విభాగాలు మాత్రం విరామం లేకుండా కంపెనీ కోసం పని చేసి ఆయన ఆరోగ్యం దెబ్బతిందని.. ఆ బాధలోనే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకున్నారని ప్రకటించాయి. మరోవైపు లుకోలి లో పని చేసే వేల మంది ఉద్యోగులు గురువారం ఆయనకు నివాళులు అర్పించారు. తీవ్ర అనారోగ్యంతో ఆయన కన్నుమూసినట్లు కంపెనీ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇదీ చదవండి: రూ. 437 కోట్లకు ముంచేసిన యూట్యూబ్ స్టార్
Comments
Please login to add a commentAdd a comment