నాటు వైద్యుని ఇంట్లో మహిళ శవం  | Bengaluru: Woman Found Dead in Herbal Healers House | Sakshi
Sakshi News home page

నాటు వైద్యుని ఇంట్లో మహిళ శవం 

Published Sun, Jan 23 2022 6:36 AM | Last Updated on Sun, Jan 23 2022 6:36 AM

Bengaluru: Woman Found Dead in Herbal Healers House - Sakshi

యలహంక (బెంగళూరు): అనారోగ్యం కారణంతో నాటుమందు వైద్యుని దగ్గరకు వెళ్లిన మహిళ శవమై తేలింది. యలహంక సమీపంలోని కటిగేనహళ్లిలో నివాసముండే సిద్దమ్మ (50) అనారోగ్యం కారణంతో చికిత్స కోసమని  పక్కింటిలో నివాసముంటున్న సలీం నాటువైద్యుని ఇంటికి శుక్రవారం మధ్యాహ్నం వెల్లింది.

సిద్దమ్మ రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో బంధువులు వెతకగా, సలీం ఇంటిలో చనిపోయి పడి ఉంది. సలీం పరారీలో ఉన్నాడు. యలహంక పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సలీం– సిద్దమ్మ మద్య నగదు లావాదేవీలు ఉన్నాయని తేలింది. మృతురాలి ఒంటిపైవున్న నగలు కోసం హతమార్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సలీం కోసం గాలిస్తున్నారు.    

చదవండి: (సహజీవనం చేస్తున్న మహిళపై.. ఇద్దర్ని హతమార్చి.. మరొకర్ని చంపబోతూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement