
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లో వైద్యుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మంత్రుల నివాసాల ఎదురుగా హోటల్‌లో ఆరో అంతస్తు నుంచి నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ గుంత కింద పడి వైద్యుడు మరణించారు. కూతురు పెళ్లి సంబంధం గురించి మాట్లాడటం కోసం ఇండోర్ నుంచి వచ్చిన డాక్టర్ పంకజ్కుమార్ జైన్ అనే వైద్యుడి కుటుంబం.. మూడు రోజుల క్రితం బంజారాహిల్స్‌లో హోటల్‌లో దిగింది.
చదవండి: అమ్మాయిలను రప్పించి.. లాడ్జీ రూంలో గుట్టుగా వ్యభిచారం..
ఆరో అంతస్తు మీద నుంచి లిఫ్ట్ గుంతలో నుంచి కింద పడిన పంకజ్ జైన్.. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తూ కింద పడి మృతి చెంది ఉంటారని ఆయన కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment