doctor death
-
Doctor Death: పెళ్లయి చిన్నపాప ఉందన్నా వినలేదు.. పచ్చబొట్లు వేయించుకొని..
సాక్షి, హిందూపురం: పట్టణంలోని జీఆర్ లాడ్జీలో కొన్ని రోజుల క్రితం అనుమానాస్పదంగా మరణించిన డాక్టర్ అక్షిత కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె వెంట వచ్చిన యువకుడే హంతకుడిగా తేల్చారు. దిశ పోలీసుస్టేషన్ డీఎస్పీ శ్రీనివాసులు ఆదివారం స్థానిక టూటౌన్ పోలీసుస్టేషన్లో సీఐ వెంకటేశ్వర్లుతో కలిసి వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏటూరి నాగరం పట్టణానికి చెందిన పిసింగి మహేశ్ వర్మ 6 నెలల క్రితం బస్సులో ప్రయాణిస్తుండగా వరంగల్ జిల్లా మంగపేటకు చెందిన దేంతనపల్ల డాక్టర్ అక్షిత పరిచయమైంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె ఫోన్ నెంబర్ తెలుసుకున్న మహేశ్ వర్మ ఆమెకు వీడియో కాల్స్ చేసేవాడు. ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడు. ఉన్నత విద్య కోసం కొన్నిరోజుల క్రితం అక్షిత చిక్బళ్లాపురం వెళ్లగా.. అక్కడికే వెళ్లి వేధింపులు మొదలుపెట్టాడు. అరెస్ట్ వివరాలు వెల్లడిస్తున్న ‘దిశ’ డీఎస్పీ శ్రీనివాసులు చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలు.. ఇంజనీరింగ్ విద్యార్థితో జంప్) తనకు పెళ్లయి చిన్నపాప ఉందని తిరస్కరించినా వినలేదు. ఒంటిపై ఆమె పేరు, ఫొటోలతో పచ్చబొట్లు వేసుకోవడమే కాకుండా ప్రేమ ఒప్పుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించినా అక్షిత ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఫొటోలు మార్ఫింగ్ చేసిన మహేష్ వర్మ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించి బెంగళూరు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మళ్లీ ఆ ఫొటోలను అడ్డం పెట్టుకుని ఈ నెల 24న హిందూపురంలోని జీఆర్ లాడ్జీకి రప్పించి అత్యాచారం చేశాడు. ఫొటోలు డిలీట్ చేయాలని కోరితే.. ఆమె ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేశాడు. అనంతరం లాడ్జీ నిర్వాహకుల వద్ద ఆమెకేమైందో తెలియదని అమాయకుడిలా నటిస్తూ తనే 108కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా సమాచారంతో ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. మహేష్‌వర్మపై గతంలో కూడా ఆ రాష్ట్రంలో వేధింపుల కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. జైలు శిక్ష కూడా అనుభవించాడన్నారు. -
Doctor Death Mystery: ‘అశ్లీల చిత్రాలతో బెదిరించి చంపేశాడు’
సాక్షి, హిందూపురం (శ్రీసత్యసాయి జిల్లా): తన సోదరి చిత్రాలను మార్ఫింగ్ ద్వారా అశ్లీల చిత్రాలు మార్చి బెదిరించి లాడ్జికి వచ్చేలా చేసి ఆమెను చంపేశాడని పట్టణంలోని జీఆర్ లాడ్జిలో బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందిన డాక్టర్ అక్షిత సోదరుడు శషాంక్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు.. వరంగల్ జిల్లా మంగపేటకు చెందిన దేంతనపల్లి అక్షిత కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని ఓ మెడికల్ కళాశాలలో పీజీ చదువుతోంది. ఈమెకు 6 నెలల క్రితం మెదక్ జిల్లా పటాన్ చెరువుకు చెందిన మహేష్ వర్మ బస్సులో పరిచయమయ్యాడు. అక్షిత ఇన్‌స్ట్రాగామ్ ఫాలో అయ్యి ఆమె ఫొటోలు డౌన్లోడ్ చేసుకున్నాడు. వాటిని అశ్లీలంగా మార్చిన అనంతరం అక్షితకు చూపి బెదిరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే బుధవారం ఆమెను హిందూపురంలోని జీఆర్ లాడ్జికి వచ్చేలా చేశాడు. లాడ్జిలోని ఓ రూంలో గొంతు నులిమి హత్య చేశాడు. ఈ మేరకు మృతురాలి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. నిందితుడు మహేష్ వర్మ పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. చదవండి: (లాడ్జిలో ప్రియుడితో దిగిన అక్షిత.. దారుణ హత్య) -
హైదరాబాద్‌లో వైద్యుడి అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లో వైద్యుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మంత్రుల నివాసాల ఎదురుగా హోటల్లో ఆరో అంతస్తు నుంచి నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ గుంత కింద పడి వైద్యుడు మరణించారు. కూతురు పెళ్లి సంబంధం గురించి మాట్లాడటం కోసం ఇండోర్ నుంచి వచ్చిన డాక్టర్ పంకజ్‌కుమార్ జైన్ అనే వైద్యుడి కుటుంబం.. మూడు రోజుల క్రితం బంజారాహిల్స్‌లో హోటల్లో దిగింది. చదవండి: అమ్మాయిలను రప్పించి.. లాడ్జీ రూంలో గుట్టుగా వ్యభిచారం.. ఆరో అంతస్తు మీద నుంచి లిఫ్ట్ గుంతలో నుంచి కింద పడిన పంకజ్ జైన్.. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తూ కింద పడి మృతి చెంది ఉంటారని ఆయన కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విజృంభిస్తున్న విష జ్వరాలు.. డెంగీతో యువ డాక్టర్ మృతి
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు కలవరపెడుతున్నాయి. ఒకపక్క ప్రజలు జలుబు, దగ్గుతో బాధపడుతుండగా.. మరోవైపు విష జ్వరాలు వణికిస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటివి ప్రాణాలు తీస్తున్నాయి. ప్రబలుతున్న వ్యాధులపై సాక్షి ప్రత్యేక కథనం. – కుత్బుల్లాపూర్ ► కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో చెత్తా చెదారాలకు తోడు ఆయా ప్రాంతాల్లో పందులు, దోమల బెడద అధికంగా ఉంది. ► మలేరియా సిబ్బంది తూతూ మంత్రంగా కాలనీల్లో పర్యటిస్తూ పనులు చేస్తున్నా దోమలు విజృంభిస్తున్నాయి. ► దీంతో అనేకమంది డెంగీ జ్వరాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. ► ఓ యువ డాక్టర్ ప్రస్తుతం డెంగీతో మరణించడంతో స్థానికంగా ఇప్పుడు కలకలం రేపుతోంది. ► నిజామాబాద్‌కు చెందిన అర్పిత రెడ్డి (32) జీడిమెట్ల డివిజన్ మీనాక్షి ఎస్టేట్స్‌లో ఉంటూ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది. 5 రోజుల క్రితం త్రీవమైన జ్వరం రావడంతో నగరంలోని గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించగా డెంగీగా తేలింది. చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం మృత్యువాత పడడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈమెకు ఒక కూతురు ఉంది. ఓ డాక్టర్ విధంగా డెంగీతో చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది. పత్తాలేని వైద్యాధికారులు... చదవండి: ఆడ దోమలే ఎందుకు కుడతాయి.. వాళ్లను ప్రేమిస్తాయి! ► ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలం మురికివాడల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాల్సిన వైద్య ఆరోగ్య అధికారులు పత్తా లేకుండా పోవడంతో రోగాలు విజృంభిస్తున్నాయి. ఒకవైపు విషజ్వరాలు సోకి ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారి సంఖ్య రోజు రోజుకు అధికం అవుతోంది. స్థానికంగా పారిశుద్ధ్యం విషయంలో జంట సర్కిల్ వైద్యాధికారులు తమ పరిధి కాదన్నట్లు వ్యవహరిస్తూ ఉండడంతో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా గాజులరామారం సర్కిల్ పరిధిలో వైద్య ఆరోగ్య శాఖ విభాగం పనితీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం ఫొటోలకే పరిమితం అన్నట్లుగా స్థానికంగా విధులు నిర్వహించే వైద్యాధికారి తీరుపై పలు మురికివాడ ప్రాంత ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న డెంగీ కేసులు.. ► కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ కేసులు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే కరోనాతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో విష జ్వరాలు సోకడం వల్ల మరింత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు వాపోతున్నారు. మీనాక్షి ప్రాంతానికి చెందిన ఓ మహిళ సుచిత్ర సమీపంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఐసీయూలో చికిత్స పొందుతుండగా, స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీకి చెందిన ఓ విద్యార్థిని ఇటీవల పేట్‌బషీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు సమీపంలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయట పడింది. -
పాపం.. కరోనా కాటుకు డాక్టర్ మృతి
మొరదాబాద్(యూపీ): కరోనా పోరాటంలో ముందుండి పోరాడుతున్న వైద్యులను కూడా మహమ్మారి బలి తీసుకుంటోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో ఓ వైద్యుడు కరోనా కాటుకు బలైయ్యారు. కోవిడ్-19 సోకిన వైద్యుడొకరు.. తీర్థంకర్ మహవీర్ యూరివర్సిటీ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ప్రాణాలు కోల్పోయినట్టు మొరదాబాద్ ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఎంసీ గార్గ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో కరోనా వైరస్ కారణంగా వైద్యుడు మృతి చెందడం ఇదే మొదటిసారి. మొరదాబాద్ నుంచి తబ్లిగీ జమాత్ సమ్మేళనానికి హాజరైన వారిని గుర్తించడానికి నిర్వహించిన సర్వేలో సదరు డాక్టర్ కూడా పాల్గొన్నారు. ఏప్రిల్ 10న ఆయనకు కోవిడ్ సోకినట్టు గుర్తించారు. పరిస్ధితి విషమంగా మారడంతో తర్వాతి రోజు ఆయనను ఐసీయూకు తరలించారు. గత ఐదు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, చికిత్స కూడా ఆయన స్పందించలేదని వైద్యులు తెలిపారు. కాగా, కేంద్ర వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు 1176 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18 మంది మృత్యువాత పడ్డారు. కోవిడ్-19 సోకినప్పటికీ 129 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 17,656 కాగా, మృతుల సంఖ్య 559గా తేలింది. 2,842 మంది కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర వైద్యారోగ్య తాజాగా వెల్లడించింది. మా నాన్న మరణ వార్త విని బాధపడ్డా.. అంత్యక్రియలకు వెళ్లను -
పారాచూట్ తెరుచుకోక..
హైదరాబాద్: నగరానికి చెందిన ఓ వైద్యుడు హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూమనాలి విహారయాత్రకు వెళ్లి అక్కడ మృతి చెందారు. దీంతో కొత్తపేట డివిజన్ మోహన్‌నగర్ పరిధిలోని సమతాపురి కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన లక్క వేమారెడ్డి–లక్ష్మిల దంపతుల చిన్న కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి(24) నగరంలోని ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫిజియోథెరపీ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సమతాపురి కాలనీకి చెందిన స్నేహితులు విశాల్, అఖిల్‌తో కలసి హిమాచల్ ప్రదేశ్‌లోని కులూమనాలికి బుధవారం వెళ్లారు. శనివారం విహార యాత్రలో రోప్‌వేలో ప్రయాణిస్తుండగా వైర్లు తెగిపడ్డాయి. దీంతో పారాచూట్ సహాయంతో కిందికి దిగేందుకు ప్రయత్నించగా అది సరిగ్గా తెరుచుకోకపోవడంతో కిందపడి పోయారు. దీంతో చంద్రశేఖర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ద్వారా మాట్లాడించి మృత దేహాన్ని నగరానికి తీసుకొచ్చేందుకు ప్రయతి్నస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
వరకట్న వేధింపులకు వైద్యురాలు బలి
- అత్తింటివారే హత్య చేశారంటూ తల్లిదండ్రుల ఆరోపణ - పోలీసుల అదుపులో భర్త, అత్త హైదరాబాద్: అత్తింటివారి వరకట్న వేధిం పులు భరించలేక ఓ వైద్యురాలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. మృతురాలు కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమార్తెను హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నాగయ్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వరంగల్ జిల్లా శివనగర్‌కు చెం దిన గజ్జెల లింగమూర్తి, కళావతిల రెండో కుమార్తె భవానికి హసన్‌పర్తి మండలం చింతగట్టుకు చెందిన దోమల సత్యరాజు, శ్రీవాణి కుమారుడు పృధ్వీరాజుతో 2014, ఫిబ్రవరి 21న వివాహం జరిగింది. వీరు మేడిపల్లి పీఅండ్‌టీ కాలనీలోని ఎస్ఆర్ రెసిడెన్సీలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ఎంబీ బీఎస్ పూర్తి చేయడంతో ఉప్పల్‌లోని ఆదిత్య హాస్పిటల్లో వైద్యులుగా పనిచేసేవారు. నాలు గు నెలల క్రితం వీరికి ఒక బాబు జన్మిం చాడు. దీంతో భవాని హాస్పిటల్ మానేసి ఇంట్లోనే వుండగా, పృధ్వీరాజు మాత్రం మరోచోట ఉ ద్యోగం చేస్తున్నాడు. ఇటీవల సత్యరాజు తమ కుమార్తెల వద్ద కుటుంబ అవసరాలు నిమిత్తంగా డబ్బులు తీసుకున్నారు. అవి చెల్లిం చడం కోసం తరుచుగా కోడలిని అదనపు కట్నం కోసం వేధించేవారు. భవాని పీజీ చదువుకోవడానికి భర్త, అత్తమామలు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం భవాని చెల్లెలు దేవి వివాహం జరిగింది. ఈ వివాహంలో సత్యరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అక్కడ మర్యాదలు సరిగా జరుగలేదన్న కారణం పై భవాని, పృధ్వీరాజుల మధ్య చిన్న గొడవ జరిగింది. మేడిపల్లికి వచ్చిన తరువాత మరలా గొడవ జరగడంతో తీవ్ర మనస్థాపం చెందిన భవాని సోమవారం రాత్రి 9 గం.కు బెడ్రూం లోకి వెళ్లింది. ఎంత సేపటికి తలుపు తీయకపోవడంతో.. గడియ విరగకొట్టి చూడగా ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించింది. అత్తింటివారు భవాని ఆత్మహత్య విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి వివరాలు సేకరించారు. అయితే తమ కూతురుది ఆత్మహత్యకాదని.. అత్తింటివారే హత్య చేశారంటూ భవాని తల్లిదండ్రులు.. సత్యరాజు, శ్రీవాణి, పృధ్వీరాజుతో పాటు అతని అక్క చెల్లెలు రేవతి, సుచరిత, బావలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పృధ్వీరాజు, శ్రీవాణిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన... భవాని మృతికి కారణమైన అత్తింటివారిని కఠినంగా శిక్షించాలని.. భవాని తల్లిదండ్రులు, బంధువులు పోలీసుస్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. లింగమూర్తి, కళావతి మాట్లాడుతూ వివాహం సమయంలో రూ.5 లక్షల కట్నం, 10 తులాలు బంగారం, 50 తులాలు వెండి, రూ.2 లక్షలు పెళ్లి ఖర్చులకు ఇచ్చినట్లు పేర్కొన్నారు.